iDreamPost

ఇంట్లో ఉంటూ.. నెలకు రూ.45 వేలు సంపాదించే బిజినెస్! లైఫ్ సెట్ పక్కా!

  • Published Jun 10, 2024 | 8:03 PMUpdated Jun 10, 2024 | 8:04 PM

ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా.. అలాంటి వారి కోసం ఈజీగా ఇంటి దగ్గర నుంచే నెలకు రూ.45వరకు ఆదాయం వచ్చే బెస్ట్ బిజినెస్ ఫ్లాన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కాకపోతే దీనికి కొద్దిగా శ్రమ అవసరం ఉంటుంది.

ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా.. అలాంటి వారి కోసం ఈజీగా ఇంటి దగ్గర నుంచే నెలకు రూ.45వరకు ఆదాయం వచ్చే బెస్ట్ బిజినెస్ ఫ్లాన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కాకపోతే దీనికి కొద్దిగా శ్రమ అవసరం ఉంటుంది.

  • Published Jun 10, 2024 | 8:03 PMUpdated Jun 10, 2024 | 8:04 PM
ఇంట్లో ఉంటూ.. నెలకు రూ.45 వేలు సంపాదించే బిజినెస్! లైఫ్ సెట్ పక్కా!

ఇటీవల కాలంలో మట్టి పాత్రల వినియోగం ఎంతలా పెరిగిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ మట్టి పాత్రాల్లో ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం వలన జరిగే ప్రయోజనాలు గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలగడంతో అందరూ ఈ మట్టి పాత్రలను కొనుగోలు చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే.. గతంలో ఎన్నాడు లేని విధంగా చాలామంది ఇళ్లలో ఈ మట్టి పాత్రాలు వినియోగం అనేది క్రమేపి పెరిగిపోయింది. అంతేకాకుండా.. ఇప్పుడు రోడ్డు మీద కూడా ఎక్కడబడితే అక్కడ మట్టి పాత్రల్లో తినే ఫుడ్ లను పెడుతూ విక్రయిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ప్రతిఒక్కరు ఏదో ఒక వ్యాపారం చేయాలని కలలు కంటుటారు. మరి, అలాంటి వారికి ఈ మట్టి పాత్రలు వ్యాపారం బెస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వకాలంలో మన ఇళ్ళల్లో వంట పాత్రలుగా మట్టి కుండలనే ఉపయోగించేవారు.అయితే ఆ తర్వాతి కాలంలో మాత్రం వాటి వాడకం బాగా తగ్గిపోయి.. ప్లాస్టిక్, స్టీలు వంటివి వినియోగిస్తున్నారు. కానీ, ఈ మధ్య కాలంలో మట్టి పాత్రల వినియోగం ఆరోగ్యనికి ఎంతో మంచిదో ప్రజలకు అవగహన పెరిగి క్రమంగా వాటిని వినియోగించడం మొదలుపెడుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈ మట్టి పాత్రల వినియోగం చాలావరకు నగరాల్లో కూడా పెరిగిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం మార్కెట్ లో ,రూ.150 నుంచి 1500 ధర వరకు పలికే అనేక రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉంటున్నాయి.ఇక వాటిని తయారు చేసి సేల్ చేస్తే మంచి రాబడి వస్తుంది. అలాగే ఇళ్లల్లోనే మీరు మట్టి పాత్రలు తయారు చేసి వాటిని వివిధ మార్కెటింగ్ కి పద్ధతులను ఉపయోగించి సేల్ కనుక మంచి లాభాలు పొందవచ్చు. అయితే వీటి కావాల్సినది మట్టి, బొగ్గుర, కలప ఇది కాల్చడానికి కావాలి.

Sand pots making bussiness

ఇక ఆ కుండలను తయారు చేసే కుమ్మరి చక్రం ఉంటే చాలు. దీని ద్వారా మట్టి కుండలు దగ్గర నుంచి మట్టి గ్లాస్లు, పాత్రలు వంటివి తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు వీటిని మార్కెట్ లో ఓ చిన్న షాప్ ఓపెన్ చేసి మరి అమ్ముకోవచ్చు. అలాగే అన్ లైన్ లో కూడా వీటిని అమ్ముకోవచ్చు. కాకపోతే వీటకి కాస్త యాభై, ఆరవై వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక కాస్త శ్రమించాల్సి ఉంటుంది. అంతేకాకుండా..ఈ మట్టి పాత్రల్లో ఆర్గానిక్ ఫుడ్ అమ్ముతూ నెలకు సుమారు రూ.40వేల నుంచి రూ.45 వేల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు.అయితే మీరు కనుక వ్యాపారం చేయాలని ఆలోచనలో ఉంటే చక్కగా ఇంటి దగ్గర నుంచే ఈ మట్టి పాత్రల బిజినెస్ ను ప్రారంభించి నెలకు రూ.45వేల వరకు ఆదాయం పొందండి. మరి, వ్యాపారం చేయాలనుకునే వారికి ఇంటి దగ్గర నుంచే లాభాలు పొందే ఈ మట్టి పాత్రల బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి