69వ జాతీయ సినీ పురస్కారాలలో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికైన విషయం తెలిసిందే. 2021 సంవత్సరానికి గాను బన్నీని ఈ అవార్డు వరించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు బన్నీ. ఆ సినిమాలో పుష్పారాజ్ క్యారెక్టర్ లో రగ్గడ్ అండ్ రఫ్ లుక్ లో అందరిని విశేషంగా మెప్పించాడు. కట్ చేస్తే.. పుష్ప సినిమాకు ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఇంకా అవార్డులు అందుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే.. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకొని.. ఫస్ట్ తెలుగు యాక్టర్ గా రికార్డులోకెక్కాడు. దీంతో ఇండస్ట్రీ నుండి.. రాజకీయ ప్రముఖుల నుండి బన్నీపై ప్రశంసలు జల్లు కురుస్తోంది.
ఇక అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ముఖ్యం ఏపీ సీఎం జగన్.. “69వ జాతీయ పురస్కారాలలో తెలుగు జెండా రెపరెపలాడుతోంది. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అని ట్విట్టర్ వేదికగా అభినందించారు. అయితే.. సీఎం జగన్ ప్రశంసలపై బన్నీ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా రిప్లై ఇస్తూ.. “థ్యాంక్యూ జగన్ గారు. మీ నుండి మెసేజ్ రావడం చాలా ఆనందంగా ఉంది” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి బన్నీకి నేషనల్ అవార్డు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Thank you soo much @ysjagan garu . It’s a great pleasure to see your msg . Thank you soo much for your heartfelt msg 🙏🏽
— Allu Arjun (@alluarjun) August 24, 2023