iDreamPost

విషాదం: విమానం ఎక్కుతుండగా మహిళకు గుండెపోటు..

చిన్నారుల నుండి కాటికి కాలు చాపే ముదసలి వరకు గుండె పోటుకు గురై చనిపోతున్నారు. ఈ క్షణం ఆనందంగా గడిపిన వ్యక్తులు.. హార్ట్ ఎటాక్ కారణంగా మరు క్షణంలో విగత జీవులుగా కనిపిస్తూ కన్నీరు పెట్టిస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా గుండె ప్రాణాలను కోరుతోంది.

చిన్నారుల నుండి కాటికి కాలు చాపే ముదసలి వరకు గుండె పోటుకు గురై చనిపోతున్నారు. ఈ క్షణం ఆనందంగా గడిపిన వ్యక్తులు.. హార్ట్ ఎటాక్ కారణంగా మరు క్షణంలో విగత జీవులుగా కనిపిస్తూ కన్నీరు పెట్టిస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా గుండె ప్రాణాలను కోరుతోంది.

విషాదం:  విమానం ఎక్కుతుండగా మహిళకు గుండెపోటు..

గుప్పెడంత గుండె ఎంత విషాదాన్ని నింపుతుందో. ఉన్నపళంగా ఊపిరి తీసి..కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేస్తుంది. ఊహించని విధంగా గుండెల్లో మంట రేపుతూ.. కూలబడిపోయేలా చేసి కోలుకోలేని దెబ్బ వేస్తుంది. ఆనంద సమయాల్లోనూ, విషాదంలోనూ కనికరం చూపించకుండా కలవరపాటుకు గురి చేస్తూ.. చంపేస్తుంది. చిన్నా, పెద్ద తారతమ్యం లేదు.. ఆరోగ్యం, అనారోగ్యం పట్టింపులు ఏమీ లేవు గుండెపోటుకు. గుండెల్లో చిన్నగా మెలిపెడుతూ.. కుప్పకూలిపోయేలా చేస్తోంది హార్ట్ ఎటాక్. ఈ రోజుల్లో రానూ రానూ హార్ట్ స్ట్రోకో‌తో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం దీని బారిన పడి మరణించిన సంగతి విదితమే.

ఓ మహిళ విమానం ఎక్కుతుండగా.. గుండెపోటుకు గురై మరణించింది. ఆమెది నల్లొండ జిల్లా. జిల్లాలోని నార్కట్ పల్లి మండలంలోని చిన్న నారాయణ పురం సర్పంచి కె. నర్సింహా భార్య ఇందిరా బాయి (48). ఆమె డ్వాక్రా ఉద్యోగిని. స్థానికంగా సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లో సీఆర్పీలకు నెల రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సుకు రాష్ట్రం నుండి ఎంపిక చేసిన 400 మందిలో ఆమె కూడా ఉంది.  అవగాహన సదస్సుల్లో పాల్గొనేందుకు పంజాబ్ వెళ్లారు. సదస్సులు అయిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్ బయలు దేరారు. చండీగఢ్‌లో విమానం ఎక్కుతుండగా.. ఒక్కసారిగా గుండె పోటు రావడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన.. ఇందిర మృతదేహాన్ని స్వగ్రామమైన చిన్న నారాయణ పురానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఆమె మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆమె మృతి వార్తను కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణ వార్తతో తోటి సీఆర్పీలు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి