iDreamPost

Yuvraj Singh: రవిశాస్త్రికి యువరాజ్ కౌంటర్.. గిల్ ఇలాగే సమాధానం ఇస్తాడంటూ..!

శుబ్ మన్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. గిల్ ను పొగుడుతూనే దిగ్గజాలకు కౌంటర్ ఇచ్చాడు.

శుబ్ మన్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. గిల్ ను పొగుడుతూనే దిగ్గజాలకు కౌంటర్ ఇచ్చాడు.

Yuvraj Singh: రవిశాస్త్రికి యువరాజ్ కౌంటర్.. గిల్ ఇలాగే సమాధానం ఇస్తాడంటూ..!

శుబ్ మన్ గిల్.. గత సంవత్సరం ఇంటర్నేషనల్ క్రికెట్ లో పరుగులు వరదపారించాడు. కానీ ప్రస్తుతం దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీమిండిగా మాజీ దిగ్గజాలు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ లు అతడికి హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన విమర్శలన్నింటికీ.. ఒకే ఒక్క సెంచరీతో సమాధానం ఇచ్చాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన సెంచరీతో ఆదుకుని, జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. గిల్ ను పొగుడుతూనే దిగ్గజాలకు కౌంటర్ ఇచ్చాడు.

టీమిండియా యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు. విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో కీలక సమయంలో సెంచరీ సాధించి.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడానికి కారణమైయ్యాడు. ఇక ఈ ఒకే ఒక్క ఇన్నింగ్స్ తోనే తనపై వచ్చిన అన్ని విమర్శలకు చెక్ పెట్టాడు ఈ యువ ప్లేయర్. ఈ శతకంతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. అయితే ప్రశంసలతో పాటుగా గిల్ ను విమర్శించిన టీమిండియా మాజీ దిగ్గజాలు అయిన సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు.

UV counter to former coach!

“శుబ్ మన్ గిల్ అద్భుతంగా ఆడావు. మరోసారి జట్టుకు అవసరమైన టైమ్ లో సత్తా చాటావు. టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు శతకంతో చెలరేగిన తీరు గొప్పగా ఉంది. ఇక నుంచి నువ్వు బ్యాట్ తోనే మాట్లాడుతూ ఉండు” అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. యువీ భాయ్ మీరు ఇండైరెక్ట్ గా సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలకే కదా కౌంటర్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం గిల్ పై ఈ ఇద్దరు దిగ్గజాలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మరి పరోక్షంగా మాజీ కోచ్ కు యువీ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: షాకింగ్ న్యూస్.. టీమిండియా ఆటగాడిపై పోక్సో కేసు నమోదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి