iDreamPost

షాకింగ్ న్యూస్.. టీమిండియా ఆటగాడిపై పోక్సో కేసు నమోదు!

టీమిండియాకు చెందిన స్టార్ ప్లేయర్ పై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ సంఘటన క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియాకు చెందిన స్టార్ ప్లేయర్ పై పోక్సో కేసు నమోదు అయ్యింది. ఈ సంఘటన క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

షాకింగ్ న్యూస్.. టీమిండియా ఆటగాడిపై పోక్సో కేసు నమోదు!

టీమిండియాకు చెందిన స్టార్ ప్లేయర్ పై పోక్సో కేసు నమోదు అయ్యింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను పలుమార్లు అత్యాచారం చేశాడని 22 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

వరుణ్ కుమార్.. టీమిండియా జాతీయ హాకీ జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. తాజాగా ఇతడిపై పోక్సో కేసు నమోదు అయ్యింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై వరుణ్ కుమార్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 22 ఏళ్ల యువతి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం వరుణ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసు బృందం గాలిస్తోంది. అసలేం జరిగిందంటే? “2018లో ఇన్ స్టాగ్రామ్ ద్వారా వరుణ్ నాకు పరిచయం అయ్యాడు. మా మధ్య బాండింగ్ పెరగడంతో.. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు” అంటూ సదరు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ న్యూస్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

POCSO case on Team India player! 1

ఇదిలా ఉండగా.. 28 ఏళ్ల వరుణ్ కుమార్ టీమిండియా హాకీ జట్టులో డిఫెండర్ స్థానంలో ఆడతాడు. 2017 నుంచి నేషనల్ టీమ్ కు ఆడుతున్నాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో సైతం పాల్గొన్నాడు. స్టాండ్ బై సభ్యుడిగా ఉన్నాడు. భారత జట్టు తరఫున 142 మ్యాచ్ లు ఆడిన వరుణ్ మెుత్తం 40 గోల్స్ చేశాడు. అర్జున అవార్డును సైతం వరుణ్ అందుకున్నాడు. ఇక కేసు నమోదు కాకముందు వరకు వరుణ్ భువనేశ్వర్ లోని జాతీయ శిక్షణా శిబిరంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: Brendon McCullum: టీమిండియాకు ఇంగ్లండ్ కోచ్ వార్నింగ్.. ఇక అసలైన ఆట చూపిస్తామంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి