iDreamPost

కెప్టెన్ పాండ్యాకు చుక్కలు చూపించిన అన్ క్యాప్డ్ ప్లేయర్!

MI vs DC- Jake Fraser: ఢిల్లీ క్యాపిటల్స్ చిచ్చర పిడుగు జేక్ ఫ్రాజర్ మరోసారి తన బ్యాటుతో అందరినీ బెదరగొట్టేశాడు. మరోసారి కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేశాడు. ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చుక్కలు చూపించాడు.

MI vs DC- Jake Fraser: ఢిల్లీ క్యాపిటల్స్ చిచ్చర పిడుగు జేక్ ఫ్రాజర్ మరోసారి తన బ్యాటుతో అందరినీ బెదరగొట్టేశాడు. మరోసారి కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేశాడు. ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చుక్కలు చూపించాడు.

కెప్టెన్ పాండ్యాకు చుక్కలు చూపించిన అన్ క్యాప్డ్ ప్లేయర్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మరో హీటెడ్ ఇన్నింగ్స్ లోడిండ్. ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్- ముంబయి ఇండియన్స్ మ్యాచ్ లో జేక్ ఫ్రేజర్ తన బ్యాటుతో చెలరేగిపోయాడు. చూడటానికి చిన్న కుర్రాడిలా ఉండే ఈ చిచ్చర పిడుగు ఏకంగా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ కి పగలే చుక్కలు చూపించాడు. హార్దిక్ పాండ్యా ఓవర్లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. నిజానికి అతనిది ఆట కాదు.. ముంబయి బౌలర్లను వేటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క బౌలర్ ని కూడా వదలకుండా ఇరగదీస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేసి మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఢిల్లీ వేదికగా జేక్ ఫ్రేజర్ మరోసారి విజృంభించాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లపై జాలి, దయ లేకుండా విజృంభించాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తూ తాండవం ఆడేశాడు. అసలు అతడిని ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా అవుట్ చేయాలి అనే విషయాలు మర్చిపోయి.. ఈ ఓవర్లో బౌండరీలు పడకుండా చాలు దేవుడా అని కోరుకునేలా చేసేశాడు. ఆఖరికి ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా వదల్లేదు. పాండ్యా ఓవర్లో జేక్ ఫ్రేజర్ చెలరేగిపోయాడు. ఒకే ఓవర్లో మొత్తం 20 పరుగులు చేశాడు. తొలి బంతిని ఫోర్ కొట్టిన ఫ్రేజర్ తర్వాతి బంతి డాట్ అయ్యింది. ఆ తర్వాత సిక్సర్ బాదేశాడు. తర్వాత మరో బంతి డాట్ అవ్వగా.. ఐదో బంతి ఫోర్, ఆఖరి బంతిని సిక్సర్ గా మలిచాడు.

మొత్తానికి హార్దిక్ పాండ్యాను కూడా వణికించేశాడు. జేక్ ఫ్రేజర్ ఢిల్లీ తరఫున్ రెండుసార్లు ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. రెండుసార్లు 15 బంతుల్లోనే అర్ధ శతకాలు నమోదు చేశాడు. 15 బంతుల్లో అర్ధ శతకం నమోదు చేసిన ఆటగాళ్లు అయిన రస్సెల్, నరైన్ సరసన జేక్ ఫ్రేజర్ నిలిచాడు. ప్రస్తుతం ఈ సీజన్లో జేక్ ఫ్రేజర్ పేరు మారుమోగుతోంది. ఆఖరికి చావ్లా బౌలింగ్ లో జేక్ ఫ్రేజర్ అవుటయ్యాడు. కేవలం 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 84 పరుగులు చేశాడు. ఫ్రేజర్ శతకం నమోదు చేస్తాడని అంతా భావించారు. కానీ, చావ్లా అవుట్ చేసేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తరఫున జేక్ ఫ్రేజర్ ఓపెనింగ్ కూడా చేయబోతున్నాడు అంటున్నారు.

ఇంత ప్రామిసింగ్ ఇన్నింగ్స్ కంటిన్యూగా ఇస్తుంటే.. స్థానం ఇవ్వకుండా ఎలా ఉంటారు? మొత్తానికి ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాకు చుక్కలు చూపించాడు అంటూ నెట్టింట ఆల్రెడీ కామెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. హార్దిక్ పాండ్యా వేసిన 2 ఓవర్లలో ఏకంగా 41 పరుగులు ఇచ్చేశాడు. ఈ మ్యాచ్ లో ప్రస్తుతానికి అత్యధిక ఎకానమీతో పాండ్యా ఉన్నాడు. ఈ ప్రదర్శనతో మరోసారి పాండ్యా మీద విమర్శలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. ఆస్ట్రేలియా డైనమైట్ జేక్ ఫ్రేజర్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి