iDreamPost

వీడియో: అమెరికా పోలీసులు నిర్వాకం.. నాడు జార్జ్- నేడు టైసన్ మృతి!

Frank Tyson Passed Away- American Police: నాలుగేళ్ల తర్వాత అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరహా ఘటన జరిగింది. మరో నల్లజాతీయుడిపై పోలీసులు నీ హోల్డ్ ప్రయోగించారు. అతను ఊపిరి ఆడక స్పృహ కోల్పోయాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Frank Tyson Passed Away- American Police: నాలుగేళ్ల తర్వాత అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరహా ఘటన జరిగింది. మరో నల్లజాతీయుడిపై పోలీసులు నీ హోల్డ్ ప్రయోగించారు. అతను ఊపిరి ఆడక స్పృహ కోల్పోయాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

వీడియో: అమెరికా పోలీసులు నిర్వాకం.. నాడు జార్జ్- నేడు టైసన్ మృతి!

అమెరికాలో దారుణం వెలుగు చూసింది. పోలీసులు దారుణానికి ఒడి గట్టారు. నాలుగేళ్ల క్రితం మిన్నియాపోలిస్ లో పోలీసులు మెడపై కాలుతో ఒత్తి పెట్టడం వల్ల ఊపిరి ఆడక.. జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ ఘటన పెద్ద ఎత్తున నిరసనలు, దుమారానికి దారి తీసింది. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత అలాంటి ఒక ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 7 నిమిషాల పాటు ఆ పోలీసు అధికారి ఫ్లాయిడ్ మెడపై మోకాలుతో నొక్కాడు. ప్రస్తుతం అమెరికా పోలీసుల తీరుపై సర్వత్రా నిరసనలు, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నల్లజాతీయుడు అనే అక్కసుతోనే ఒక వ్యక్తి నిండు ప్రాణాలు తీశారంటూ తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.

అసలు ఏం జరిగిందంటే.. ఓహియోలో ఫ్రాంక్ టైసన్(53)ను పోలీసులు హిట్ అండ్ రన్ కేసులో అనుమానితుడిగా భావించారు. అతను ఓ బార్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఫ్రాంక్ టైసన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు బార్ కు వెళ్లారు. ఆ సమయంలో టైసన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫ్రాంక్ టైసన్ ను బలవంతంగా అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. అతను ప్రతిఘటించడంతో అక్కడున్న పోలీసులు అంతా కలిసి టైసన్ ను అదుపులోకి తీసుకుని అతనికి బేడీలు వేస్తున్నారు. ఆ సమయంలో ఒక అధికారి టైసన్ మెడ మీద మోకాలుతో నొక్కాడు. అతను నాకు ఊపిరి ఆడటం లేదు అంటూ అరుస్తూ ఉండటం స్పష్టంగా వినిపిస్తోంది. కానీ, ఆ పోలీసులు పట్టించుకోలేదు. తర్వాత కాసేపటికి ఫ్రాంక్ టైసన్ స్పృహ కోల్పోయాడు. అతని బేడీలు తీసేసి.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ టైసన్ ప్రాణాలు కోల్పోయాడు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నల్లజాతీయుడు కాబట్టే టైసన్ ను పోలీసులు దారుణంగా హత్య చేశారు అంటూ విమర్శలు చేస్తున్నారు. నెట్టింట పెద్దఎత్తున దుమారం రేగింది. అమెరికా పోలీసుల తీరును ఎండ గడుతున్నారు. అయితే ఫ్రాంక్ టైసన్ మృతిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులను సెలవుపై పంపేశారు. ఈ ఘటన ఏప్రిల్ 18న జరగ్గా.. వీడియో వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఫ్రాంక్ టైసన్ ఇప్పటికే కొన్నేళ్లపాటు జైలు శిక్షను అనుభవించి వచ్చాడు. అయితే టైసన్ పెరోల్ కి సంబంధించి ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వలేదంటూ పోలీసులు బుకాయిస్తున్నారు. ఫ్రాంక్ టైసన్- పోలీసులకు మధ్య జరిగిన సంభాషణ, తనకు ఊపిరి ఆడటం లేదు అంటూ వేసిన కేకలు అన్నీ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. పోలీసుల తీరుపై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి