iDreamPost

KKR vs PBKS: నిన్న రికార్డు ఛేజింగ్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా? ఆ బౌలర్ పై అనుమానాలు!

కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన రికార్డ్ ఛేజింగ్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఓ బౌలర్ పై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన రికార్డ్ ఛేజింగ్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఓ బౌలర్ పై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

KKR vs PBKS: నిన్న రికార్డు ఛేజింగ్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా? ఆ బౌలర్ పై అనుమానాలు!

ఐపీఎల్ 2024 సీజన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంతలా ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతూ.. రికార్డు మీద రికార్డులు బద్దలు కొడుతున్నారు. మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వీరబాదుడికి రికార్డులు వణికిపోతున్నాయి. అయితే తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా నిన్న(ఏప్రిల్ 26, శుక్రవారం) కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ద్వారా చరిత్రను తిరగరాశారు. 262 పరుగుల లక్ష్యాన్ని మంచినీళ్లు తాగినంత ఈజీగా కొట్టేశారు పంజాబ్ ఆటగాళ్లు. అయితే ఈ మ్యాచ్ లో ఫిక్స్ అయ్యిందా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వస్తున్నాయి. ఓ బౌలర్ పై అనుమానాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ 262 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. దీంతో మ్యాచ్ కేకేఆర్ ఈజీగానే గెలుస్తుందని టీమ్ తో పాటుగా ప్రేక్షకులు సైతం భావించారు. కానీ అనూహ్యంగా చెలరేగిన పంజాబ్ ప్లేయర్లు 262 పరుగుల టార్గెట్ ను కేవలం 18.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచికొట్టారు. పంజాబ్ బ్యాటర్లు ప్రభ్ సిమ్రన్(54), జానీ బెయిర్ స్టో(108*), శశాంక్ సింగ్(68*) మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు రికార్డ్ విజయాన్ని అందించారు. అయితే ఈ రికార్డ్ ఛేజింగ్ మ్యాచ్ పై ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. దానికి కారణం ఏంటంటే?

15 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 201/2తో పటిష్టంగానే ఉంది. చివరి 5 ఓవర్లలో 61 పరుగులు కావాలి. ఈ టైమ్ లో 16వ ఓవర్ వేయడానికి వచ్చాడు హర్షిత్ రాణా. అప్పటికే అతడు 2 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నాడు. క్రీజ్ లో జానీ బెయిర్ స్టో, శశాంక్ సింగ్ లు ఉన్నారు. రౌండ్ ద స్టంప్ లో బౌలింగ్ ఎటాక్ చేశాడు రాణా. తొలి బంతిని శశాంక్ ఫోర్ గా మలిచాడు. అయితే ఆ తర్వాత గొప్పగా పుంజుకున్న రాణా మిగతా బంతుల్లో వరుసగా 1, 0 , 1, 1, 2 మాత్రమే ఇచ్చాడు. దీంతో ఈ ఓవర్లో కేవలం 9 రన్స్ మాత్రమే వచ్చాయి.

అయితే ఆ తర్వాత 18 ఓవర్ వేయడానికి మళ్లీ వచ్చాడు హర్షిత్ రాణా. కానీ ఇక్కడే రాణా ఓ తప్పు చేశాడు. తొలి బాల్ వైడ్ వేశాడు. అయితే అనూహ్యంగా తన బౌలింగ్ ఎటాక్ స్టిక్ ను మార్చుకున్నాడు. అంపైర్ కు కుడివైపు నుంచి బౌలింగ్ చేశాడు. అప్పటి వరకు ఆఫ్ సైడ్ బంతులు ఆడేందుకు ఇబ్బందులు పడుతున్న బెయిర్ స్టో, శశాంక్ లు బౌలింగ్ స్టిక్ మారే సరికి లయ తప్పాడు హర్షిత్. ఇంకే ముందు లైగ్ సైడ్ బంతులను శశాంక్ ఊచకోత కోశాడు. వరుస బంతుల్లో 6, 6, 4 బాదాడు, చివరి బంతిని బెయిర్ స్టో కూడా 6 బాదాడు. దీంతో ఈ ఓవర్లో 25 పరుగులు వచ్చాయి. మ్యాచ్ టర్నింగ్ అయ్యింది ఈ ఓవర్ తోనే.

అతడు గత ఓవర్ వేసినట్లుగా రౌండ్ ద స్టిక్ కాకుండా తన బౌలింగ్ ను మార్చుకోవడం అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. తక్కువ పరుగులు ఇచ్చిన సైడ్ నుంచి బౌలింగ్ వేయకుండా ఇలా సడెన్ గా తన స్టిక్ ను మార్చుకోవడం వెనక మతలబు ఏంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా? అనుమానాలు కలుగుతున్నాయి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అయితే ఫిక్సింగ్ గురించి ఎక్కడా అధికారిక సమాచారం లభించడం లేదు. కేవలం నెటిజన్లు మాత్రమే హర్షిత్ రాణా బౌలింగ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ రికార్డ్ ఛేజింగ్ మ్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి