iDreamPost
android-app
ios-app

పాటలో భాగంగా పవన్‌ని కాలితో తన్నిన నటిని గుర్తుపట్టారా? అప్పట్లో ఆమె రేంజ్ అది!

  • Published Apr 27, 2024 | 3:54 PM Updated Updated Apr 27, 2024 | 3:54 PM

తమ కన్నా హీరోయిన్ పాత్ర ఎక్కువ ఉన్నా, డామినేటింగ్ గా అనిపించిన హీరోలు ఒప్పుకోరు. కానీ ఓ నటి ఏకంగా స్టార్ హీరోను పాటలో భాగంగా కాలితో తన్ని అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు.. ఏ సినిమాలో అంటే..?

తమ కన్నా హీరోయిన్ పాత్ర ఎక్కువ ఉన్నా, డామినేటింగ్ గా అనిపించిన హీరోలు ఒప్పుకోరు. కానీ ఓ నటి ఏకంగా స్టార్ హీరోను పాటలో భాగంగా కాలితో తన్ని అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు.. ఏ సినిమాలో అంటే..?

  • Published Apr 27, 2024 | 3:54 PMUpdated Apr 27, 2024 | 3:54 PM
పాటలో భాగంగా పవన్‌ని కాలితో తన్నిన నటిని గుర్తుపట్టారా? అప్పట్లో ఆమె రేంజ్ అది!

‘అబ్బాయిలు-అమ్మాయిలు’ సమానం.. అయితే ‘అబ్బాయిలు కాస్త ఎక్కువ సమానం’ అని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. ఈ మాట ముందు సినిమా పరిశ్రమకే ఆపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెమ్యునరేషన్ దగ్గర నుండి స్క్రీన్ షేరింగ్ వరకు హీరోయిన్లను డామినేట్ చేస్తుంటారు హీరోలు. ఇక హీరోయిన్లతో రొమాన్స్ ఓకే కానీ.. తమ కన్నా హీరోయిన్ పాత్ర ఉంటే ఎక్కువ ఉన్నా..స్ట్రాంగ్, ఎస్టాబ్లీష్ అయితేనే సహించలేరు. ఇక వాళ్ల కాళ్లు తాకిన సన్నివేశాలు చేయాల్సి వస్తే.. ఆ సీన్ స్కిప్ చేసేందుకో లేక.. డూప్‌తో కవర్ చేసేస్తుంటారు. మరి అలాంటిది ఓ స్టార్ హీరోను ఏకంగా కాలితో తన్నింది ఓ నటి. అందులో కూడా ఓ సినిమాలో. మరీ ఆ నటి ఎవరు.. అప్పట్లో ఆమె రేంజ్ ఎలా ఉండేదో తెలుసా..?

టాలీవుడ్ టాప్ హీరో, మెగాస్టార్ తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా యూత్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చూసి ఊగిపోతుంటారు  ఫ్యాన్స్. ఆ స్టార్ హీరో నటించిన సినిమాల్లో ఒకటి గుడుంబా శంకర్. ఇందులో పవన్ వేసే రెండు ఫ్యాంట్స్ ఎంత ఫేమస్.. కామెడీ ట్రాక్ అంతే ఫేమస్. ఇందులో హీరోయిన్‌ నటించింది మలయాళ బ్యూటీ మీరా జాస్మిన్. ఈ ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో గిత్తలు మోగించేసింది. ఇది ఆమెకు తెలుగులో రెండో సినిమా. ఈ సినిమాలో ఆమె పవన్ కళ్యాణ్‌ను కాలితో తన్నుతుంది. ఎక్కడ అనుకుంటున్నారా..? చిగురాకు చాటు చిలుక సాంగ్‌లో వెనుక నుండి వచ్చి కాలితో కొడుతుంది. హీరోను కాళ్లతో తన్నడం అప్పట్లో కాస్త చర్చకూడా అయ్యిందనుకోండి.

పవన్‌ను కాలితో తన్నడేమో కానీ.. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది. అమ్మాయి బాగుంది చిత్రంలో అలరించి.. గుడుంబా శంకర్ మూవీ మేనియాతో తెలుగులో మంచి ఆఫర్లును కొల్లగొట్టింది.  రవితేజ సరసన భద్రతో ఆమె విపరీతమైన క్రేజ్ వచ్చింది.  ఇక తమిళ్ డబ్బింగ్ మూవీ పందెంకోడితో అయితే ఇలాంటి అమ్మాయే భార్యగా వస్తే బాగుండు అనుకున్నారు అప్పటి కుర్రకారు. లంగావోణీలతో,  పంజాబీ డ్రెస్సులతో, చిలిపి కళ్లతో, చిరు నవ్వుతో కట్టిపడేసింది ఆమె. చాలా మందికి హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, బంగారు బాబు, అఆ, ఇఈ, ఆకాశ రామన్న వంటి చిత్రాల్లో నటించింది. చక్కగా ముద్ద మందారంలా ఉండే ఆమె కేవలం తెలుగే కాదు.. మాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్నే.

2008లో మాండలిన్ రాజేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంటానని చెప్పిన మీరా.. 2014లో అనిల్ జాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని దుబాయ్ వెళ్లిపోయింది. మళ్లీ 2016 తర్వాత క్యామియో పాత్రలో కానీ పెద్దగా స్క్రీన్లపై కనిపించింది లేదు. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతుంది. గత ఏడాది మలయాళంలో క్వీన్ ఎలిజిబెత్ మూవీ చేయగా.. ఇప్పడు తమిళంలో ది టెస్ట్ అనే చిత్రం చేస్తుంది. ఇటీవల విమానం అనే సినిమాలో కూడా క్యామియో పాత్రలో మెరిసింది అమ్మడు. అయితే ఇప్పటికీ కూడా ఆమెను మలయాళ ఇండస్ట్రీ  స్టార్ హీరోయిన్‌గా చూస్తుంది. రెడ్ కార్పెట్ పరుస్తూ.. రీ ఎంట్రీలో కూడా హీరోయిన్‌గా అవకాశాలను అందిస్తోంది  మాలీవుడ్.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobetcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom