iDreamPost

ఇంటర్ పాసయ్యారా? ఐతే మీ కోసమే వందల జాబ్స్.. భారీ వేతనాలు!

మీరు ఇంటర్ పూర్తి చేశారా? జాబ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా? ఎలాంటి జాబ్ లో జాయిన్ అయితే మంచి జీతం వచ్చి లైఫ్ బాగుంటుంది? ఇంటర్ అర్హతతో వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటి? వంటి వివరాలు మీ కోసం.

మీరు ఇంటర్ పూర్తి చేశారా? జాబ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా? ఎలాంటి జాబ్ లో జాయిన్ అయితే మంచి జీతం వచ్చి లైఫ్ బాగుంటుంది? ఇంటర్ అర్హతతో వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటి? వంటి వివరాలు మీ కోసం.

ఇంటర్ పాసయ్యారా? ఐతే మీ కోసమే వందల జాబ్స్.. భారీ వేతనాలు!

ఇంటర్ పాసయ్యాక చాలా మంది ఇంజనీరింగ్ అని, ఎంబీబీఎస్ అని, డిగ్రీ అని అనేక కోర్సుల్లో జాయిన్ అవుతారు. అయితే ఈ చదువులు చదవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడే వారు బయట మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్స్ నేర్చుకుని జాబ్ లో జాయిన్ అవుతారు. ఇలా ఆలోచించే వారి కోసం ఈ కథనం బాగా ఉపయోగపడుతుంది. 

ఇంటర్ అయ్యాక ఫ్రీలాన్స్ జాబ్స్ చేసుకోవచ్చు. లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. ఫ్రీలాన్స్ జాబ్స్ చేస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. ఫ్రీలాన్స్ జాబ్స్ విషయానికొస్తే.. ఇందులో వీడియో ప్రొడక్షన్ గురించి మాట్లాడుకోవాలి. స్క్రిప్ట్ రైటర్ గా, వీడియో ఎడిటర్ గా, యానిమేటర్ గా, గ్రాఫిక్ డిజైనర్ గా, ఆడియో స్పెషలిస్ట్ గా పనిచేయచ్చు. ఈ జాబ్స్ కి 20 వేల నుంచి 25 వేల వరకూ జీతాలు ఇస్తారు.  

టెక్ కి సంబంధించిన జాబ్స్ లో యాప్ డెవలపర్, వెబ్ డెవలపర్, యూఐ, ఎస్ఈఓ జాబ్స్ ఉన్నాయి. వీటికి కూడా జీతాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర ఫ్రీలాన్స్ ఉద్యోగాల విషయానికొస్తే.. కాపీ రైటర్, ట్రాన్స్క్రైబింగ్ వంటి జాబ్స్ ఉన్నాయి. ఫ్రీలాన్సర్, నౌకరి వంటి ఆన్ లైన్ పోర్టల్స్ లో జాబ్స్ ని వెతుక్కోవచ్చు. స్కిల్స్ లేకపోతే 6 నెలలు పాటు ఆయా స్కిల్స్ రిలేటెడ్ కోర్సులు పలు ఇన్స్టిట్యూట్ లు ఆఫర్ చేస్తున్నాయి. ఫీజులు కూడా తక్కువే ఉంటాయి.  

ఇవన్నీ పార్ట్ టైం జాబ్స్.. ఇలా కాకుండా ఫుల్ టైం గవర్నమెంట్ జాబ్స్ చేయాలని అనుకుంటే కనుక ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. 

SSC CHCL: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్:  

  • జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ (జేఎస్ఏ), లోయర్ డివిజనల్ క్లర్క్(ఎల్డీసీ) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైతే రూ. 19,900 – 63,200/- మధ్యలో జీతం ఉంటుంది. 
  • సార్టింగ్ అసిస్టెంట్(ఎస్ఏ), పోర్టల్ అసిస్టెంట్(పీఏ), డీఈఓ(గ్రేడ్ ఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈఓ) పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి జీతాలు రూ. 25,500 నుంచి 81,100 మధ్యలో ఉంటాయి.

SSC CHCL సిలబస్:

  • టైర్ 1 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): జనరల్ ఇంటిలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్ నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ మీద కంప్యూటర్ పరీక్ష ఉంటుంది.
  • టైర్ 2: ఆర్థిక సంస్కరణలు, జాతీయ భద్రతలు వంటి టాపిక్స్ మీద వ్యాసం రాయాల్సి ఉంటుంది.
  • టైర్ 3: డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది.

SSC GD – జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్: 

ఈ ఎగ్జామ్ రాస్తే బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ఎఫ్, ఎన్ఐఏ పోస్టుల్లో కానిస్టేబుల్ గా చేరచ్చు. ఈ పోస్టులకి జీతం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది. ఈ జాబ్ కోసం కంప్యూటర్ ఆధారిత టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. 

SSC Stenographer (ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ జాబ్స్): 

ప్రెస్ కాన్ఫిరెన్స్ లో సీనియర్ అధికారులు మాట్లాడే మాటలను రికార్డ్ చేసి వాటిని టైప్ చేసి ఒక డాక్యుమెంట్ గా రెడీ చేయాలి. ఇందులో గ్రేడ్ సీ, గ్రేడ్ డీ కేటగిరీల్లో జాబ్స్ ఉంటాయి. గ్రేడ్ సీ కేటగిరీ స్టెనోగ్రాఫర్ కి రూ. 51,000 జీతం అయితే గ్రేడ్ డీ స్టెనోగ్రాఫర్ కి రూ. 36,000 జీతం ఉంటుంది. కటింగ్ లు పోనూ గ్రేడ్ సీ కేటగిరీ స్టెనోగ్రాఫర్ చేతికొచ్చే జీతం రూ. 35,000 నుంచి 40,000 ఉంటుంది. అదే గ్రేడ్ డీ కేటగిరీ స్టెనోగ్రాఫర్ కి అయితే కటింగ్ లు పోనూ చేతికి రూ. 18 వేల నుంచి 22 వేలు వస్తాయి. 

SSC MTS (ఎస్ఎస్సీ ఎంటీఎస్):

ఎస్ఎస్సీ ఎంటీఎస్ అంటే మల్టీ స్టాఫ్ ఎగ్జామ్. ఉన్నతాధికారులకు సంబంధించి వారి శాఖల్లో వారికి అసిస్టెంట్ గా ఉండాలి. కొరియర్ డెలివరీ చేయడం, దినచర్య, డిస్ ప్యాచ్ వంటి ఆఫీస్ వర్క్ కి సహాయం చేయడం.. కంప్యూటర్స్, ఫైల్స్, ఇతర పేపర్లు క్యారీ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనికి జీతం నెలకు రూ. 18 వేల నుంచి రూ. 22 వేలు ఉంటుంది. 

ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్:

రైల్వేస్ కి సంబంధించిన ఈ జాబ్ ప్రొఫైల్ విషయానికొస్తే.. లోకోపైలట్స్ కి సహాయం చేయడం, లోకోమోటివ్స్ ని రిపేర్ అండ్ మెయింటెనెన్స్ చూసుకోవడం, ట్రాక్స్ లో లోపాలు ఉన్నాయేమో అని గుర్తించడం, రైల్వే సిగ్నల్స్ పై నిఘా ఉంచడం వంటివి చేయాలి. ఈ జాబ్ కి కనీస వేతనం 19 వేలు కాగా.. యావరేజ్ గా 24 వేల నుంచి 34 వేల రేంజ్ లో ఉంటుంది. దీని కోసం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 

ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్:

సముద్రంలో ఆపదలో ఉన్న మత్స్యకారులకు సహాయం చేయడం, రక్షించడం.. సైంటిఫిక్ డేటాను సేకరించడం, సముద్ర పర్యావరణ వ్యవస్థను రక్షించడం, మెయింటెనెన్స్ చూసుకోవడం, ఉన్నతాధికారులు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ కి జీతం పొజిషన్ బట్టి ఉంటుంది. నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్ట్ కి కనీస వేతనం 21,700 ఉంటుంది. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్ట్ కి 21,700 జీతం ఉంటుంది. యాంత్రిక్ పోస్ట్ కి 29,200 ఉంటుంది. ప్రధాన అధికారి పోస్ట్ కి 47,600 జీతం చెల్లిస్తారు. ఇవి కాకుండా డియర్ నెస్ అలోవెన్సులు, ఇతర అలోవెన్సులు కూడా ఉంటాయి. దీనికి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.  

సెక్యూరిటీ ఫోర్సెస్:

శత్రు శక్తుల నుంచి ఆయుధాలకు, ఆస్తులకు, సిబ్బందికి భద్రత కల్పించడమే సెక్యూరిటీ ఫోర్సెస్ పని. ఈ జాబ్ కి యావరేజ్ గా 19,667 రూపాయల జీతం చెల్లిస్తారు. అత్యధికంగా 37,500 రూపాయలు చెల్లిస్తారు. 

ఇవి కాకుండా డెలివరీ ఏజెంట్ గా స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో జాయిన్ అవ్వచ్చు. లేదా ఓలా, ఉబర్, ర్యాపిడో కెప్టెన్ గా.. లేదా డ్రైవర్ గా చేరచ్చు. వీళ్ళకి నగరాల్లో పిచ్చ డిమాండ్ ఉంది. బాగా సంపాదించుకోవచ్చు. ఈ పని చేస్తూనే మీకు వేరే గోల్స్ ఉంటే వాటిని నెరవేర్చుకోవచ్చు. ఇవే ఇంటర్ అర్హతతో వచ్చే ఉద్యోగాలు. పార్ట్ టైమ్, ఫుల్ టైం ఆన్ లైన్ లో చేయగలిగేవి.. అలానే ప్రభుత్వ ఉద్యోగాలు. మరి ఈ కథనాన్ని ఇంటర్ విద్యార్థులకు షేర్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి