iDreamPost

షాకింగ్ కుంభకోణం.. పరీక్షల్లో జైశ్రీరామ్ అని రాసిన వారికి ఫస్ట్ క్లాస్!

  • Published Apr 27, 2024 | 5:49 PMUpdated Apr 27, 2024 | 5:49 PM

సాధారణంగా పరీక్షలలో పాస్ అవ్వాలంటే ప్రశ్నకు తగిన సమాధానాలు రాయాలి. కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు విద్యార్థులు ట్రెండ్ మార్చేశారు. వింత వింతగా ఆన్సర్స్ చేస్తున్నారు. ఈ విద్యార్థి రాసిన ఆన్సర్ చూస్తే అందరు ఆశ్చర్య పోవాల్సిందే.

సాధారణంగా పరీక్షలలో పాస్ అవ్వాలంటే ప్రశ్నకు తగిన సమాధానాలు రాయాలి. కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు విద్యార్థులు ట్రెండ్ మార్చేశారు. వింత వింతగా ఆన్సర్స్ చేస్తున్నారు. ఈ విద్యార్థి రాసిన ఆన్సర్ చూస్తే అందరు ఆశ్చర్య పోవాల్సిందే.

  • Published Apr 27, 2024 | 5:49 PMUpdated Apr 27, 2024 | 5:49 PM
షాకింగ్ కుంభకోణం.. పరీక్షల్లో జైశ్రీరామ్ అని రాసిన వారికి ఫస్ట్ క్లాస్!

స్కూల్స్ లో కాలేజీలలో పరీక్షలంటే అందరికి భయమే.. పరీక్షలకు ముందు కష్టపడి చదివేస్తూ.. ఎటు వంటి ప్రశ్నలు వస్తాయా.. వాటికీ ఎలా సమాధానాలు రాయాలా అని తెగ ఆలోచిస్తూ ఉండేవారు. కానీ అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. పరీక్షలలో స్లిప్ లు పెట్టి సరైన సమాధానాలు రాసే మాట అటుంచితే.. సినిమా స్టోరీలు రాయడం మాట కూడా పక్కన పెట్టేస్తే.. వీటి అన్నటిని దాటేసి. ఇంకాస్త విచిత్రమైన ఆన్సర్స్ రాస్తూ.. టీచర్స్ కు షాక్ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు ఎన్నో చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు మరో విద్యార్థి ఆన్సర్ షీట్ లో రాసిన ఆన్సర్ కు.. టీచర్ కూడా వంత పలకడంతో.. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ లో ఉన్న.. వీర్ హదూర్‌ సింగ్‌ పుర్వాంచల్‌ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ విద్యార్థులు ఏం రాసిన సరే.. ప్రొఫెసర్లు వంత పాడుతున్నారని.. పాస్ చేసేస్తున్నారని.. ఆరోపణలు వచ్చాయి. దీనితో సమాచార చట్టం ద్వారా ఆ ఆన్సర్ షీట్స్ ను ఓపెన్ చేయగా.. అదే నిజం అయింది. ఎందుకంటే, ఆ ఆన్సర్ షీట్ లో.. ఓ ప్రశ్నకు జై శ్రీరామ్ అని రాసి ఉంది. పైగా ఆ విద్ద్యార్దిని పాస్ కూడా చేశారు. దీనితో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన డీ ఫార్మసీ పరీక్షలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనితో అధికారులు చర్యలు చేపట్టి.. ఆయా విభాగాలలో ఉండే ప్రొఫెస్సర్లను సస్పెండ్ చేశారు. అంతే కాకుండా యూనివర్సిటీలో డబ్బులు తీసుకుని మరీ, విద్యార్థులను పాస్ చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి.

Exams in UP

దీనితో.. ఆ యూనివర్సిటీ విద్యార్థి నేత దివ్యాంశు సింగ్… ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వైస్ ఛాన్సలర్లకు లేఖలు రాశారు. పైగా అందులో కొంతమంది విద్యార్థులకు ఏమి రాయకపోయిన కూడా అరవై శాతంకు పైగా మార్కులు వేసినట్లు గుర్తించారు. ఆ ఆన్సర్ షీట్స్ లో జై శ్రీరామ్ తో పాటు.. క్రికెటర్స్ పేర్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య లాంటి పేర్లను కూడా కొంతమంది విద్యార్థులు రాశారు. ఇప్పుడు ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో సోషల్ మీడియాలో దీనిని చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా స్పదింస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి