iDreamPost

OTTలో ఇది మరో RX100! వేసవిలో ఇంకాస్త హీట్ పెరగడం పక్కా!

OTT Suggestions- Best Romantic Movie: ఓటీటీలో చాలానే క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాలు చూసుంటారు. ఈ వీకెండ్ కి ఈ లవ్ స్టోరీ చూసేయండి. ఈ మూవీ కథ ఆర్ఎక్స్ 100ని గుర్తు చేస్తుంది.

OTT Suggestions- Best Romantic Movie: ఓటీటీలో చాలానే క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్ డ్రామాలు చూసుంటారు. ఈ వీకెండ్ కి ఈ లవ్ స్టోరీ చూసేయండి. ఈ మూవీ కథ ఆర్ఎక్స్ 100ని గుర్తు చేస్తుంది.

OTTలో ఇది మరో RX100! వేసవిలో ఇంకాస్త హీట్ పెరగడం పక్కా!

తెలుగు ఆడియన్స్ కు లవ్ స్టోరీలు అంటే ప్రత్యేకమైన లైకింగ్ ఉంటుంది. నిజానికి లవ్ స్టోరీస్ ని తెలుగు ప్రేక్షుకుల ఇష్టపడినంతగా మరో ఆడియన్స్ ఇష్టపడరేమో? అందుకే మన తెలుగులో ఎన్నో అద్భుతమైన లవ్ స్టోరీలు వచ్చాయి. అలాగే ఎన్నో అద్భుతమైన విజయాలు కూడా అందుకున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన లవ్ స్టోరీస్ లో మీకు బాగా నచ్చిన ఐకానిక్ ప్రేమకథ అంటే ఎక్కువ ఆర్ఎక్స్ 100 అంటారు. తెలుగు ప్రేక్షకులపై ఆ మూవీ అంత ప్రభావం చూపింది. అయితే టాలీవుడ్ లో అలాంటి తరహా కథతో మరో ఆర్ఎక్స్ 100లాంటి మూవీ వచ్చిందని మీకు తెలుసా?

తెలుగులో ఆర్ఎక్స్ 100, అర్జున్ రెడ్డి వంటి సినిమాలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి ఒక కథతో మరో మూవీ వచ్చింది. కాకపోతే చిన్న స్టార్ కాస్ట్ కావడంతో పెద్ద ప్రేక్షకుల్లోకి వెళ్లలేదు. దాదాపుగా చాలా మంది తెలుగు ఆడియన్స్ ఈ మూవీ గురించి తెలియకపోవచ్చు. కానీ, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఆ మూవీ మరేదో కాదు.. పోస్టర్. ఈ మూవీ 2021లో విడుదలైంది. ఒక మంచి లవ్ స్టోరీ మాత్రమే కాకుండా.. కెరీర్ కి సంబంధించిన బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా ఇది. లైఫ్ లో ఏది సాధించలేకపోయినా కూడా.. చావే పరిష్కారం కాదు. అనే విషయాన్ని చాలా బలంగా చెప్పారు.

ఈ రోజుల్లో యూత్ ఇలాంటి మూవీస్ ని తప్పకుండా చూడాలి. ఇందులో మంచి లవ్ స్టోరీ ఉంది. మంచి మోటివేషనల్ పాయింట్ ఉంది. కొడుకుపై తండ్రి ప్రేమ, జీవితం మీద ఉంచుకోవాల్సిన బాధ్యతలకు సంబంధించి మంచి పాయింట్ తో వచ్చింది ఈ మూవీ. ప్రతి చిన్న సమస్యకు ఆత్మ*హత్యలు చేసుకుంటున్న ఈ రోజుల్లో పోస్టర్ సినిమా ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తిస్తుంది. ఈ మూవీ విజయ్ ధరన్, రాశీ సింగ్, అక్షతా సోనవానే, శివాజీ రాజా, కాశీ విశ్వనాథ్, మధుమణి కీలక పాత్రల్లో నటించారు.

ఈ మూవీకి ఈ కాస్టింగ్ కూడా మంచి ప్లస్ అనే చెప్పాలి. ఒక తండ్రిగా శివాజీ రాజా అందరినీ మెప్పించాడు. తన కొడుకు ఏమైపోతాడో అనే బాధను ఆడియన్స్ హార్ట్ టచ్ అయ్యేలా కన్వే చేశాడు. ఒక థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్ గా చేసే శివాజీ రాజా.. తన కొడుకు జీవితంలో ఏమీ సాధించలేక పోస్టర్లు అంటించుకునే స్థాయికి వచ్చేస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు. మరోవైపు హీరో ఒక గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. వారి మధ్య ఉన్న అంతస్తు అనే అంతరం వల్ల వారు సమస్యలు ఎదుర్కొంటారు. మరి.. మీరు కూడా ఈ పోస్టర్ సినిమాని చూసేసి.. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి