iDreamPost

2043 కేజీల గంజాయి.. చితిలా పేర్చి.. నిప్పంటించిన మహిళా SP చందన దీప్తి!

దేశాన్ని, రాష్ట్రాలను పట్టి పీడుస్తున్న అతి పెద్ద సమస్య మాదక ద్రవ్యాల వినియోగం. యువత ఈ మత్తుకు చిత్తు అవుతున్న సంగతి విదితమే. తాాజాగా తెలంగాణలో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు.

దేశాన్ని, రాష్ట్రాలను పట్టి పీడుస్తున్న అతి పెద్ద సమస్య మాదక ద్రవ్యాల వినియోగం. యువత ఈ మత్తుకు చిత్తు అవుతున్న సంగతి విదితమే. తాాజాగా తెలంగాణలో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు.

2043 కేజీల గంజాయి.. చితిలా పేర్చి.. నిప్పంటించిన మహిళా SP  చందన దీప్తి!

సమాజాన్ని,యువతను నాశనం చేస్తున్నాయి మాదక ద్రవ్యాలు. వీటికి బానిసలై ఎంతో మంది యువకులు యవ్వన దశలోనే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఎన్నో జీవితాల్లో, కుటుంబాల్లో చిచ్చు పెట్టిన డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు తెలుగు రాష్ట్రాల పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అక్రమ మార్గాల్లో చేతులు మారుతున్నాయి. పోలీసులు కళ్లు గప్పి హెరాయిన్, కొకైన్ మాత్రమే కాదు గంజాయి వంటి మాదక ద్రవ్యాలతో విచ్ఛలవిడిగా వ్యాపారాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా యువతనే టార్గెట్ చేస్తోంది ఈ మాఫియా. చిన్న చిన్నపొట్లాలుగా , లేదంటే చాక్లెట్స్ ఇతర రూపాల్లో అందిస్తున్నారు. వీటిని తీసుకుని లైఫ్స్ చిత్తు చేసుకుంటున్నారు యూత్.

అయితే ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి పట్టుకుంటున్నారు పోలీసులు. ఇటీవల తెలంగాణలోని నల్గొండలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి కిలోల కొద్దీ గంజాయిని పట్టుకున్నారు. కోట్ల విలువైన గంజాయిని కాల్చి వేశారు మహిళా ఎస్పీ. వివిధ కేసుల్లో 2,043 కేజీల గంజాయి పట్టుబడింది. 39 కేసుల్లో ఈ మోతాదులో గంజాను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ఐదు కోట్ల రూపాయలు పై చిలుకు ఉంటుంది. ఈ మొత్తాన్ని నల్గొండ జిల్లా మహిళా ఎస్పీ చందన దీప్తి కాల్చి బూడిద చేశారు. పట్టుబడ్డ గంజాయిని పట్టణ శివార్లకు తరలించారు. ఓ అటవీ ప్రాంతంలో వీటన్నింటిని చితిగా పేర్చి.. నిప్పంటించారు. ఈ గంజాయిని నార్కోటిక్స్ కంట్రోల్ టీమ్ అధికారుల సమక్షంలో కాల్చి బూడిద చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ కేసు వివరాలను వెల్లడించారు. ‘డ్రగ్ డిస్ట్రక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 39 వివిధ కేసుల్లో.. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15 పోలీస్ స్టేషన్లలో ఇది లభించింది. రూ. 5.10 కోట్లు విలువ చేసే 2043 కిలోల గంజాయిని ఈ నెల 26న దహనం చేశాం’ అని వెల్లడించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు ఆమె చర్యను అభినందిస్తున్నారు. చందన దీప్తికి హేట్సాఫ్ చెబతున్నారుు. సోషల్ మీడియాల ద్వారా కూడా కొంత మంది కంగ్రాట్స్ చెబుతున్నారు.  ఇక నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లు ఎలానో ఉండనే ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి