iDreamPost

Jake Fraser-McGurk: జేక్ ఫ్రేజర్ సునామీ ఇన్నింగ్స్.. గిల్ క్రిస్ట్ రికార్డ్ బద్దలు!

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఓపెనర్, ఆసీస్ చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే ఫిఫ్టీ బాది ఔరా అనిపించాడు. ఈ క్రమంలోనే ఆసీస్ లెజెండ్ గిల్ క్రిస్ట్ రికార్డ్ బ్రేక్ చేశాడు ఫ్రేజర్. పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఓపెనర్, ఆసీస్ చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే ఫిఫ్టీ బాది ఔరా అనిపించాడు. ఈ క్రమంలోనే ఆసీస్ లెజెండ్ గిల్ క్రిస్ట్ రికార్డ్ బ్రేక్ చేశాడు ఫ్రేజర్. పూర్తి వివరాల్లోకి వెళితే..

Jake Fraser-McGurk: జేక్ ఫ్రేజర్ సునామీ ఇన్నింగ్స్.. గిల్ క్రిస్ట్ రికార్డ్ బద్దలు!

జేక్ ఫ్రేజర్.. ప్రస్తుతం ఐపీఎల్ లో మారుమోగుతున్న పేరు. లేట్ గా వచ్చినా.. లేటెస్ట్ గా దంచికొడుతున్నాడు ఈ 22 ఏళ్ల ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు. తాజాగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో తన విశ్వరూపం చూపించాడు. ముంబై బౌలర్లకు ఈ మ్యాచ్ తో పీడకలను మిగిల్చాడు. వచ్చిన బాల్ ను వచ్చినట్లే హిట్టింగ్ ఆడుతూ.. కేవలం 15 బంతుల్లోనే ఫిఫ్టీని కంప్లీట్ చేసుకుని తన రికార్డును తానే సమం చేసుకున్నాడు. ఈ సీజన్ లో ఫ్రేజర్ కు ఇది మూడో అర్ధశతకం కావడం విశేషం. ఇక ఈ సునామీ ఇన్నింగ్స్ తో ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ పెను విధ్వంసం సృష్టించాడు. అతడు వచ్చీ రావడంతోనే.. ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లపై ఓ యుద్ధాన్నే ప్రకటించాడు. జస్ప్రీత్ బుమ్రా సైతం అతడి ధాటికి ఎదురునిలవలేకపోయాడు. ఈ మ్యాచ్ లో కేవలం 27 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్ 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి చావ్లా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అతడు పెవిలియన్ చేరే సమయానికి ఢిల్లీ స్కోర్ 7.3 ఓవర్లలో 114 ఉందంటేనే అర్ధం చేసుకోవచ్చు.. జేక్ ఊచకోత ఏ రేంజ్ లో ఉందో. ఈ క్రమంలోనే ఓ రేర్ ఫీట్ ను సాధించాడు ఫ్రేజర్.

2009 ఐపీఎల్ సీజన్ లో డెక్కన్ ఛార్జర్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్. ఇక ఆ సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 25 బంతుల్లోనే 74 రన్స్ చేశాడు గిల్ క్రిస్ట్. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గిల్ క్రిస్ట్ మూడవ ప్లేస్ లో ఉండేవాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసి.. థర్డ్ ప్లేస్ లోకి వచ్చాడు ఫ్రేజర్. పవర్ ప్లేలో అత్యధిక రన్స్ చేసిన మూడో ప్లేయర్ గా నిలిచాడు జేక్ ఫ్రేజర్. ఈ మ్యాచ్ లో పవర్ ప్లే ముగిసే లోపు అతడు 78 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ లెజెండ్ గిల్ క్రిస్ట్ రికార్డ్ బద్దలైంది. ఇక ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్నాడు సురేశ్ రైనా. అతడు 2014 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లేలో ఏకంగా 87 రన్స్ బాదాడు. ఆ తర్వాత మెున్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ 84 రన్స్ కొట్టి సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మరి ఈ ఐపీఎల్ సీజన్ లో థండర్ ఇన్నింగ్స్ లతో చెలరేగుతున్న ఫ్రేజర్ ఆటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి