iDreamPost

OTTలో స్టార్ కమెడియన్ యోగిబాబు ఎంట్రీ! ‘చట్నీ – సాంబార్’ ఫ‌స్ట్ లుక్..

Yogi Babu: ఈ మధ్యకాలంలో ఓటీటీలో సినిమాలకు వస్తున్న ఆదరణ చూసి.. మూవీ మేకర్స్ నేరుగా ఇక్కడ తమ మూవీస్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో పెద్ద పెద్ద స్టార్లు సైతం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్నారు.

Yogi Babu: ఈ మధ్యకాలంలో ఓటీటీలో సినిమాలకు వస్తున్న ఆదరణ చూసి.. మూవీ మేకర్స్ నేరుగా ఇక్కడ తమ మూవీస్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో పెద్ద పెద్ద స్టార్లు సైతం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్నారు.

OTTలో స్టార్ కమెడియన్ యోగిబాబు ఎంట్రీ! ‘చట్నీ – సాంబార్’ ఫ‌స్ట్ లుక్..

నేటికాలంలో ఓటీటీ హవా బాగా నడుస్తోంది. థియేటర్ల చూస్తున్నప్పటికీ ఓటీటీ మూవీస్ చూసేందుకు కూడా సినీ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీలో వచ్చే కొత్త కొత్త  సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం సినీ ప్రియులు తెగ సెర్చ్ చేస్తుంటారు. ఇక ఓటీటీలో సినిమాలకు వస్తున్న ఆదరణ చూసి..చాలా మంది నేరుగా ఇక్కడ తమ మూవీస్ ను రిలీజ్ చేస్తున్నారు. చాలా మంది స్టార్లు తమ సినిమాలను, వెబ్ సిరీస్ లను ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఇలానే తాజాగా వారి జాబితాలో స్టార్ కమెడియన్ యోగిబాబు చేరనున్నారు. తాజాగా చట్నీ-సాంబార్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చట్నీ-సాంబార్ వెంబ్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట లుక్ విడుదలైంది.

యోగిబాబు.. ఈ పేరు తమిళ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో  స్టార్ కమెడియన్ ఎవరంటే.. వెంటనే గుర్తుకు వచ్చేది యోగిబాబు పేరే. తమిళ స్టార్ హీరోలందరితో కలిసి యోగిబాబు నటించారు. అంతేకాక హీరోలతో సమానంగా లీడింగ్ పొజింషన్ లో కొనసాగుతున్నాడు ఈ స్టార్ కమెడియన్. అనేక తమిళ సినిమాల్లో నటించి..తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తాడు. ఇంకా చెప్పాలంటే.. యోగిబాబుకు కూడా ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే విశాల్ హీరోగా వచ్చిన రత్నం సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. అలానే జ‌వాన్, అయాల‌న్ సినిమాల‌తో హిట్ అందుకున్న యోగిబాబు తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా వెబ్ సిరీస్‌ చట్నీ – సాంబార్. దీనికి రాధా మోహన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక  ఈ వెబ్ సిరీస్ ను ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డైరెక్ట్ గా విడుద‌ల కానుంది. త్వరలో విడుదకానున్న నేపథ్యంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ ను విడుదల చేశారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్  ఈ వెబ్ సరీస్ ఫస్ట్ లుక్  విడుద‌ల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో చూసినట్లు అయితే యోగిబాబు ఒక ఇంటికి గెస్ట్‌గా వెళ్లి అక్క‌డ ఇరుకోన్న‌ట్లు తెలుస్తుంది. అంతేకాక అతడి పాటు మిగిలిన కుటుంబ సభ్యులు కూడ డైనింగ్ టేబుల్ వద్ద భోజనంకి కూర్చాంటారు. ఇక కామెడీ థ్రిల్ల‌ర్‌గా  ఈ వెబ్ సిరీస్ రానుంది. ఇక దీని విడుద‌లకు సంబంధించిన తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఇక ఈ సిరీస్‌లో యోగిబాబుతో పాటు వాణీ భోజన్‌, షాడోస్ రవి, మైనా నందిని, దీపా శంకర్, సంయుక్తా విశ్వనాథ్ ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్రస్తుతం చట్నీ-సాంబార్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి