iDreamPost

తెలుగు సినిమాలో యాక్ట్ చేసిన యశస్వి జైస్వాల్! ఆ సీన్​లో ఉన్నది అతడేనా?

  • Author singhj Published - 06:48 PM, Sat - 15 July 23
  • Author singhj Published - 06:48 PM, Sat - 15 July 23
తెలుగు సినిమాలో యాక్ట్ చేసిన యశస్వి జైస్వాల్! ఆ సీన్​లో ఉన్నది అతడేనా?

భారత క్రికెట్ జట్టులో లెఫ్టాండర్ల కొరత ఎక్కువగా ఉంది. రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ తప్ప టీమ్​లో నిఖార్సయిన ఎడమ చేతి బ్యాటర్ మరొకరు లేరు. ఇషాన్ కిషాన్ లాంటి యంగ్ ప్లేయర్ ఉన్నా.. అతడు పర్మినెంట్ ప్లేయర్ కాదు. మరింతగా రాటుదేలి, బెస్ట్ పెర్ఫార్మెన్స్​ ఇస్తే తప్ప అతడి స్థానం పక్కా అని చెప్పలేం. గాయం నుంచి కోలుకుంటున్న రిషబ్ పంత్ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో చెప్పలేని పరిస్థితి. అందుకే మంచి లెఫ్టాండర్ బ్యాటర్ల కోసం సెలెక్టర్లు అన్వేషణ ఆరంభించారు. అలాంటి టైమ్​లో వాళ్లకు దొరికిన ఆణిముత్యమే యశస్వి జైస్వాల్. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో అదరగొట్టిన ఈ యువ సంచలనం.. ఈ ఏడాది ఐపీఎల్​లోనూ తన సత్తా చాటాడు.

ఐపీఎల్​ పెర్ఫార్మెన్స్​తో టీమిండియా తలుపులు తట్టిన జైస్వాల్​కు వెస్టిండీస్​తో టెస్ట్ సిరీస్​లో ఆడే ఛాన్స్ దక్కింది. కరీబియన్ టీమ్​తో ముగిసిన ఫస్ట్ టెస్టులో ఓపెనర్​గా బరిలోకి దిగిన జైస్వాల్ విజృంభించి ఆడాడు. డెబ్యూ మ్యాచ్​లోనే ఏకంగా సెంచరీతో అదరగొట్టి ఔరా అనిపించాడు. అతడి బ్యాటిగ్​ స్టైల్​, ఓపిక, షాట్ సెలెక్షన్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. భారత ఫ్యూచర్​ స్టార్ జైస్వాల్ అని అంటున్నారు. అలాంటి యశస్వి జైస్వాల్​కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ యువ ఓపెనర్ ఒక తెలుగు సినిమాలో నటించాడంటూ మీమ్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ యాక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ ‘విక్రమార్కుడు’. స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్​ను షేక్ చేసిన విషయం విదితమే. అయితే ఇందులో ఒక సీన్​లో అచ్చం యశస్వి జైస్వాల్​లాగే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటాడు. అది కూడా క్రికెట్ ఆడుతున్న సన్నివేశం కావడంతో అందరూ చిన్నప్పటి ఆ సీన్​లో ఉన్నది జైస్వాలేనని నెట్టింట వైరల్ చేస్తున్నారు. ‘విక్రమార్కుడు’లోని చైల్డ్ ఆర్టిస్ట్​కు, జైస్వాల్​కు పోలికలు ఉండటంతో నెటిజన్స్ మీమ్స్ చేస్తున్నారు. ఏ సత్తి బాల్ లోపలికి వచ్చిందా అనే డైలాగ్​ చెప్పే పిల్లాడికి జైస్వాల్​కు దగ్గరి పోలికలు ఉండటంతో అలా కంపారిజన్ చేస్తున్నారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్​కు చెందిన జైస్వాల్​ ఏ టాలీవుడ్ సినిమాలోనూ నటించలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి