iDreamPost
android-app
ios-app

మూడు కుటుంబాల్లో విషాదం నింపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ! అసలేం జరిగిందంటే?

  • Published Aug 13, 2023 | 12:00 PM Updated Updated Aug 13, 2023 | 1:41 PM
  • Published Aug 13, 2023 | 12:00 PMUpdated Aug 13, 2023 | 1:41 PM
మూడు కుటుంబాల్లో విషాదం నింపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ! అసలేం జరిగిందంటే?

ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు, మోసాలు, ఘోరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలి ఆత్మహత్య, ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య. ఇలా రోజు ఎన్నో వార్తలు చదువుతూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. కొందరు అమ్మాయిలు మాత్రం ఒకరిని ప్రేమిస్తూనే సీక్రెట్ గా మరొకరితో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక అసలు విషయం బయటపడడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం ఇలాగే వ్యవహరించిన ఓ బాలిక చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం కొత్తపాలెంలోని నాగేంద్ర కాలనీలో ఓ బాలిక (17) నివాసం ఉంటుంది. ఈ అమ్మాయి స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలోనే ఈ బాలిక ఆదర్శ నగర్ కు చెందిన సూర్య ప్రకాశ్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ వచ్చింది. అలా కొన్ని రోజులు అతడితో చెట్టా పట్టాలేసుకుని తిరిగింది. ఇక కొన్నాళ్లకి ఇందిరా నగర్ కు చెందిన లెంక సాయి కుమార్ అనే మరో యువకుడిని సైతం ఆ యువతి ప్రేమించింది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో సీక్రెట్ గా ట్రయాంగిల్ లవ్ స్టొరీని నడిపించింది. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఇటీవల ఆ బాలిక ప్రియుడు సాయి కుమార్ రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మాారింది.

ఈ విషయం సూర్య ప్రకాష్ కు తెలియడంతో జీర్ణించుకోలేకపోయాడు. ఇదే విషయంపై ప్రియురాలిని నిలదీశాడు. నీకు నేను కావాలో, వాడు కావాలో తేల్చుకోవాలంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తన ప్రియురాలు సూర్య ప్రకాష్ తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు సాయి కుమార్ కూడా తెలిసిపోయింది. దీంతో ముగ్గురికి ఇటీవల గొడవ కూడా జరిగింది. ఈ ఇద్దరి యువకులు ఆమెను ఒత్తిడికి గురి చేయడంతో ఇటీవల ఆ బాలిక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. బలవన్మరణానికి ముందు ఓ సూసైడ్ లెటర్ రాసినట్లుగా కూడా తెలుస్తుంది.

దీంతో మృతురాలి తండ్రి సాయి కుమార్, ప్రకాష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఇద్దరిని అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తుండగానే సూర్య ప్రకాష్ గోపాలపట్నం రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకుని మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదిలా ఉండగా సాయి కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ యువతి చేసిన పనికి మూడు కుటుంబాల్లో విషాదం నిండిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.


ఇది కూడా చదవండి: దారుణం: రెండో భార్య మోజులో పడి భర్త కిరాతకం

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom