iDreamPost
android-app
ios-app

దారుణం: రెండో భార్య మోజులో పడి భర్త కిరాతకం

దారుణం: రెండో భార్య మోజులో పడి భర్త కిరాతకం

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ పేరు స్వరూప. ఈమెకు పదేళ్ల కిందట మెదక్ జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇక కొన్నాళ్లకి వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. అలా వీరి సంసార జీవితం అలా సంతోషంగానే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భర్త రమేష్ ఇంట్లో భార్య ఉండగానే మరో మహిళపై మనసుపడ్డాడు. దీంతో భార్యకు తెలియకుండా ఎంచాక్క ప్రియురాలితో తెర వెనుక ప్రేమాయణం నడిపిస్తూ చివరికి భార్య అడ్డొస్తుందని కడతేర్చాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాలో బాట్రోతు రమేష్-స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత పదేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. అలా వీరి కాపురం కొన్నాళ్ల పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే సాగింది. ఇదిలా ఉంటే.. ఇంట్లో భార్య ఉండగానే రమేష్ మంజుల అనే మరో మహిళపై మనసుపడ్డాడు. ఇంతటితో ఆగని ఇతగాడు ఇటీవల తన ప్రియురాలిని పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రమేష్ రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి మొదటి భార్యను, కూతురుని అస్సలు పట్టించుకోవడం లేదట. ఇదే విషయంపై పెద్దలు పంచాయితి పెట్టించి సర్ది చెప్పారు.

ఈ క్రమంలోనే రమేష్ ఇటీవల స్వరూప పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మొదటి భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని స్వరూప ఆస్పత్రికి తరలించారు. చికిత్సతో కాస్త కోలుకున్నాక స్వరూప అసలు నిజాన్ని బయట పెట్టింది. నా భర్తే బలవంతంగా నాకు పురుగుల మందు తాగించాడని కుండ బద్దలు కొట్టింది. దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన స్వరూప కుటుంబ సభ్యులు భర్త రమేష్ ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో స్వరూప చికిత్స పొందుతూ ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: శంషాబాద్ మంజుల హత్య కేసులో విస్తుపోయే నిజాలు!

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş