iDreamPost

పాండ్యా.. ఇంత డబ్బు పిచ్చి ఎందుకు? కోహ్లీని చూసి బుద్ధి తెచ్చుకో..!

  • Author singhj Published - 08:41 PM, Tue - 28 November 23

ముంబై ఇండియన్స్​కు మారిన స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెట్టింట భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. అతడు చేసింది ఏమాత్రం కరెక్ట్ కాదని కొంతమంది అభిమానులు అంటున్నారు.

ముంబై ఇండియన్స్​కు మారిన స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెట్టింట భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. అతడు చేసింది ఏమాత్రం కరెక్ట్ కాదని కొంతమంది అభిమానులు అంటున్నారు.

  • Author singhj Published - 08:41 PM, Tue - 28 November 23
పాండ్యా.. ఇంత డబ్బు పిచ్చి ఎందుకు? కోహ్లీని చూసి బుద్ధి తెచ్చుకో..!

ఐపీఎల్-2024 ఆక్షన్​కు ముందు ఎంతో ఉత్కంఠ రేపిన అంశాల్లో ఒకటి హార్దిక్ పాండ్యా రిటెన్షన్. గుజరాత్ టైటాన్స్​కు కెప్టెన్​గా ఉన్న ఆ స్టార్ ఆల్​రౌండర్ ఈసారి ముంబై ఇండియన్స్​కు మారనున్నాడనే వార్తలు ఒక్కసారి గుప్పుమన్నాయి. అయితే దీన్ని పాండ్యా గానీ ముంబై, గుజరాత్ ఫ్రాంచైజీలు ఖండించలేదు. దీంతో ఇది నిజమేనని అంతా భావించారు. అయితే వరుసగా రెండు సీజన్లలో గుజరాత్​ను ఫైనల్స్​కు చేర్చి.. ఒకసారి కప్​ను అందించిన పాండ్యాను ఆ జట్టు ఎందుకు వదులుకుంటుందనేది ఎవరికీ అర్థం కాలేదు. అదే టైమ్​లో తనకు కెప్టెన్సీ ఇచ్చి ప్రోత్సహించిన ఫ్రాంచైజీని హార్దిక్ ఎందుకు వదిలేస్తున్నాడనేది కూడా చిక్కుప్రశ్నగా మారింది. రిటెన్షన్ ప్రక్రియ మొదలవ్వగానే పాండ్యాను అట్టిపెట్టుకుంటున్నట్లు ప్రకటించింది గుజరాత్. కానీ ఆ తర్వాత కాసేపటికే ముంబైకి ఇచ్చేస్తున్నట్లు వెల్లడించింది.

హార్దిక్ పాండ్యాను తమకు ఇచ్చినందుకు బదులుగా రూ.15 కోట్లను గుజరాత్​కు ముంబై ఇచ్చిందని తెలుస్తోంది. అలాగే మరికొంత మొత్తాన్ని కూడా ఇవ్వనుందట. ఇందులో సగభాగం పాండ్యాకు దక్కనుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కాగా, పాండ్యాను పంపేయడం ద్వారా గుజరాత్​కు లాభమో అర్థం కావడం లేదు. అయితే గుజరాత్ ఫ్రాంచైజీతో హార్దిక్​కు మనస్పర్థలు ఉన్నాయని, అందుకే అతడ్ని వదలుకున్నారని గాసిప్స్ వస్తున్నాయి. తన సొంత గూటికి వెళ్లిపోవడం పాండ్యాకు ఇష్టమేనని ఆ ఫ్రాంచైజీ వర్గాలు చెప్పడం ఇదే నిజమనే అభిప్రాయాలకు బలం చేకూర్చుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం పక్కా ప్లాన్​తోనే హార్దిక్​ను తీసుకుందట.

ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వెళ్లిపోయాక బలమైన కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో పాండ్యాపై కన్నేసిందట ముంబై. సారథిగా గుజరాత్​ను సమర్థంగా నడిపించాడు కాబట్టి తమకు పనికొస్తాడని ట్రేడింగ్​లో దక్కించుకుందని అంటున్నారు. అయితే వీటన్నింటి కంటే కూడా హార్దిక్ పాండ్యా విశ్వసనీయత, నిజాయితీ, విధేయత మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతడు గుజరాత్​ను వదిలేసి రావడం ఎంతవరకు కరెక్ట్‌ అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒక ఫ్రాంచైజీ తనకు రెస్పెక్ట్ ఇచ్చి, టాలెంట్​ను గుర్తించి కెప్టెన్సీ ఇచ్చి ప్రోత్సహించాక ఇలా మధ్యలో వదిలేసి వెళ్లడం సరికాదంటున్నారు. ఇది నమ్మక ద్రోహమేనని.. కాసుల కక్కుర్తి కోసమే పాండ్యా ఇలా చేశాడని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు.

డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతావా? అంటూ హార్దిక్​ను ఉద్దేశించి కొందరు నెటిజన్స్ తీవ్రంగా విమర్శలకు దిగుతున్నారు. పాండ్యా అంటే గుజరాత్.. గుజరాత్ అంటే పాండ్యా అంటూ అక్కడి అభిమానులు అంతగా ఆదరిస్తున్న టైమ్​లో ఇలా వచ్చేయడం వారిని అవమానించడమేనని, మోసగించడమేనని ఫైర్ అవుతున్నారు. అదే టైమ్​లో భారత స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేయర్ విరాట్ కోహ్లీతో పోలుస్తూ పాండ్యాను తప్పుబడుతున్నారు.

ఐపీఎల్ ట్రోఫీ కావాలనుకున్నా, మరిన్ని డబ్బులు కావాలనుకున్నా ఆర్సీబీని కోహ్లీ ఎప్పుడో వదిలేసే వాడని అంటున్నారు. ఒక్క ట్రోఫీ నెగ్గకున్నా ఆ టీమ్​ను అట్టిపెట్టుకొని ఉండిపోయాడని.. అది విరాట్ విధేయత అని కామెంట్స్ చేస్తున్నారు. లాయల్టీ అంటే ఏంటో కోహ్లీని చూసి హార్దిక్ నేర్చుకోవాలని చెబుతున్నారు. పాండ్యా.. ఇంత డబ్బు పిచ్చి ఎందుకు? కోహ్లీని చూసి బుద్ధి తెచ్చుకో అని సూచిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఈసారి ఐపీఎల్​లో ఒక్క వాంఖడేలో తప్పితే మిగతా చోట్ల హార్దిక్​పై అభిమానుల నుంచి కొంత వ్యతిరేకత తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. లాయల్టీ విషయంలో కోహ్లీని చూసి పాండ్యా నేర్చుకోవాలనే దాని మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్​పై గంభీర్ షాకింగ్ కామెంట్స్.. అతడు చేసింది కరెక్ట్ కాదంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి