Dharani
Tirupati Law Couple Crime News On July 27th 2024: తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలిని నమ్మించి.. ఆమె జీవితాన్ని నశానం చేసింది ఓ మహిళ. భర్తతో కలిసి స్నేహితురాలిపై దారుణానికి ఓడిగట్టారు. ఆ వివరాలు..
Tirupati Law Couple Crime News On July 27th 2024: తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలిని నమ్మించి.. ఆమె జీవితాన్ని నశానం చేసింది ఓ మహిళ. భర్తతో కలిసి స్నేహితురాలిపై దారుణానికి ఓడిగట్టారు. ఆ వివరాలు..
Dharani
భార్య అంటే భర్త చేసే ప్రతి పనిలో అతడికి చేదోడువాదోడుగా ఉండాలి. కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. ఒకవేళ భర్త.. తప్పుడు మార్గంలో పయనిస్తూంటే.. వారిని మందలించి.. మంచి మార్గంలో నడిపించేలా చేయాల్సిన బాధ్యత భార్యదే. భర్త చేసే తప్పులను గుర్తించి సరిదిద్ది.. అతడు సన్మార్గంలో పయనించేలా చూడాలి. ఒకవేళ అతడు మాట వినకపోతే.. దూరంగా ఉండాలి అంతే తప్ప.. భర్త చేసే పాపాల్లో పాలు పంచుకోకూడదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే మహిళ మాత్రం ఇందుకు భిన్నం. భర్త చేసే తప్పులను వారించకపోగా.. అతడిని ప్రోత్సాహించేది. అంతటితో ఆగిందా అంటే లేదు.. ఏకంగా భర్తతో కలిసి స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేసింది. సదరు మహిళ గురించి తెలిసిన తర్వాత.. అసలు మనుషులను నమ్మాలంటేనే భయపడతాం. ఈ అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
పైన ఫొటోలో కనిపిస్తోన్న మహిళ మాములు లేడీ కాదు.. ఖతర్నాక్ కిలేడి. చదివిందేమో న్యాయ విద్య.. కానీ చేసేవి మాత్రం అన్ని అక్రమాలే. ఆమె ఎంత నీచానికి పాల్పడింది అంటే.. స్నేహితురాలిని నమ్మించి.. భర్తతో కలిసి యువతి జీవితాన్ని నాశనం చేసింది. స్నేహితురాలికి మత్తుమందు ఇచ్చి.. భర్తతో ఆమె మీద అత్యాచారం చేయింది. పైగా ఆ దరిద్రాన్ని వీడియో తీసి.. ఆపై బెదిరింపులకు దిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులో వచ్చింది.
తిరుపతి పోలీసులు తెలిపిన వివరాల ప్రచారం.. తిరుపతి జిల్లా, భాకరాపేటకు చెందిన కృష్ణకిషోర్ రెడ్డి న్యాయ విద్య అభ్యసిస్తున్నాడు. అతడి భార్య ప్రణవకృష్ణ కూడా లా స్టూడెంట్‌నే. బాగా చదువుకుని.. జీవితంలో మంచి న్యాయవాదులుగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన దంపతులు.. చెడు వ్యసనాలు, ఈజీ మనీకి అలవాటు పడ్డారు. భార్యాభర్తలిద్దరికి గంజాయి అలవాటు అయ్యింది. ఇలా ఉండగా వారికి కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన బాధిత యువతి(22) తో పరియం ఏర్పడింది.
సదరు యువతి నాలుగేళ్ల కిందట తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరింది. ప్రారంభంలో కొన్ని రోజులు కాలేజీ హాస్టల్‌లో ఉండేది. ఇలా ఉండగా సదరు యువతికి ప్రణవకృష్ణతో పరిచయం ఏర్పడింది అది కాస్త బలపడి తరచుగా ఆమె ఇంటికి వెళ్లడం వరకు వచ్చింది. ఇలా ఉండగానే బాధితురాలికి ప్రణవకృష్ణ భర్త కృష్ణ కిషోర్ రెడ్డితో కూడా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే సదరు దంపతులు.. బాధితురాలికి గంజాయి అలవాటు చేశారు.
ఇలా ఉండగా ఓ సారి యువతికి గంజాయి ఇచ్చి.. ఆమె మత్తులో ఉండగా.. కృష్ణ కిషోర్ రెడ్డి.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితురాలిపై భర్త చేస్తోన్న దారుణాన్ని ఆపాల్సింది పోయే.. ప్రణవ కృష్ణారెడ్డి.. ఆ దరిద్రాన్ని వీడియో తీసింది. తర్వాత వాటిని బాధితురాలికి చూపించి బెదిరింపులకు దిగారు. యువతిని బెదిరించి ఆమె వద్ద నుంచి బంగారు నగలు, డబ్బులు, నిశ్చితార్థం ఉంగరం ఇలా అన్నింటిని తీసుకున్నారు. మరిన్ని డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే.. ఆ ఫొటోలను ఆమె కుటుంబ సభ్యులు, కాబోయే భర్తకు పంపుతామని హెచ్చరించారు.
అంతేకాక ఆ ఫొటోలు, వీడియోలను బాధిత యువతి సోదరుడితోపాటు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండు చేశారు ప్రణవకృష్ణ దంపతులు. దాంతో సదరు యువతి ఈ దారుణం గురించి ఇంట్లో చెప్పుకోలేక.. వారి వేధింపులు భరించలేక.. చివరకు ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. కుమార్తె అనుభవిస్తోన్న నరకం గురించి తెలుసుకున్న సదరు యువతి తల్లి.. బిడ్డను తీసుకుని.. ఈ నెల 25న తిరుపతి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణకిషోర్‌రెడ్డి, ప్రణవకృష్ణలను ఆయా వర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు.