iDreamPost

రోహిత్​పై గంభీర్ షాకింగ్ కామెంట్స్.. అతడు చేసింది కరెక్ట్ కాదంటూ..!

  • Author singhj Published - 07:42 PM, Tue - 28 November 23

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. హిట్​మ్యాన్ చేసింది తప్పంటూ ఫైర్ అయ్యాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. హిట్​మ్యాన్ చేసింది తప్పంటూ ఫైర్ అయ్యాడు.

  • Author singhj Published - 07:42 PM, Tue - 28 November 23
రోహిత్​పై గంభీర్ షాకింగ్ కామెంట్స్.. అతడు చేసింది కరెక్ట్ కాదంటూ..!

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమి ఇంకా భారతీయుల కళ్ల ముందే తిరుగుతోంది. వరుసగా 10 మ్యాచుల్లో గెలిచి ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై అనూహ్యంగా బోల్తా పడటాన్ని ఫ్యాన్స్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఎక్కడ తప్పు జరిగిందంటూ కారణాలు వెతికే పనిలో పడ్డారు అనలిస్టులు. లీగ్, నాకౌట్ మ్యాచ్​ల్లో కనిపించిన ఫియర్​లెస్​ యాటిట్యూడ్ ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో మిస్సయిందని అంటున్నారు. ప్రెజర్​ను సరిగ్గా డీల్ చేసి, మరింత​ అటాకింగ్ గేమ్ ఆడి ఉంటే కప్పు మనకే దక్కేదని చెబుతున్నారు. ఫైనల్ వరకు టీమ్​ను అద్భుతంగా నడుపుతూ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తుదిపోరులోనే అదే జోరును కొనసాగిస్తే సరిపోయేదని చెబుతున్నారు. ఫైనల్లో హిట్​మ్యాన్ ఔట్ అవ్వడమే టర్నింగ్ పాయింట్ అని.. రోహిత్ మరికొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదని చెబుతున్నారు.

రోహిత్ శర్మ ఆఖరి వరకు నిలబడి ఉంటే భారత్ స్కోరు 350 ప్లస్ స్కోరు చేసేదని.. దీన్ని ఆసీస్ ఛేజ్ చేయలేకపోయేదని కొందరు అనలిస్టులు చెబుతున్నారు. ఏదేమైనా కప్పు మాత్రం మిస్సయింది. 35 ఏళ్లకు పైబడిన కోహ్లీ, రోహిత్ కోసమైనా ఈసారి కప్ గెలుస్తారని అనుకుంటే మళ్లీ నిరాశే ఎదురైంది. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమికి రివేంజ్ తీర్చుకుంటారని అనకుంటే అది సాధ్యం కాలేదు. మళ్లీ అదే టీమ్ చేతిలో ఓడిపోయి కప్పును మిస్సయ్యాం. ఈ తరుణంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ చేసిన కామెంట్స్ వైరల్​గా మారాయి. వరల్డ్ కప్ ఫైనల్​కు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్​ను ఉద్దేశించి హిట్​మ్యాన్​ చేసిన వ్యాఖ్యలను గౌతీ తప్పుబట్టాడు. రోహిత్ అలా మాట్లాడటం సరికాదన్నాడు. ప్లేయర్స్ దేశం కోసమే ఆడాలని.. వ్యక్తుల కోసం కాదంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు గంభీర్. ప్రపంచ కప్-2023 ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ ద్రవిడ్​ను ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన కోసం తాము కప్ గెలవాలని అనుకుంటున్నామని తెలిపాడు.

వరల్డ్ కప్-2003 ఫైనల్లో ఓడిన భారత టీమ్​లో ద్రవిడ్ కూడా ఉన్నాడు. 20 ఏళ్ల తర్వాత ఆయన కోచింగ్​లో తాము ఆసీస్​పై రివేంజ్ తీర్చుకుంటామనే ఉద్దేశంతో హిట్​మ్యాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఓ స్పోర్ట్స్ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ సీరియస్ అయ్యాడు. ‘ఆటగాళ్లు తమ దేశం కోసం ఆడాలే తప్ప.. వ్యక్తుల కోసం కాదు. అసలు క్రికెటర్లు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారో ఇంతవరకూ నాకు అర్థం కావడం లేదు. ఒక వ్యక్తి కోసం తాము కప్పు నెగ్గాలని కోరుకుంటున్నట్లు చెప్పడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. దేశం కోసం టైటిల్ గెలవాలని అనుకోవాలి. ఒకవేళ ఒక వ్యక్తి కోసం ఇలా చేయాలని భావించినా ఆ మాటలు మీడియా ముందు చెప్పకూడదు. 2011లోనూ ఒక వ్యక్తి కోసం మనం గెలవాలని కొందరు అన్నారు. కానీ నేను మాత్రం బ్యాట్ చేతబడితే దేశం కోసమే ఆడతానని వారితో చెప్పా’ అని గంభీర్ స్పష్టం చేశాడు. 2011 వరల్డ్ కప్​ ట్రోఫీని సచిన్ టెండూల్కర్ కోసం నెగ్గుతామంటూ కొంతమంది ప్లేయర్లు చెప్పిన సంగతి తెలిసిందే. మరి.. రోహిత్ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ గంభీర్ చేసిన విమర్శలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సచిన్ పేరు మీద రైల్వే స్టేషన్ ఉందని తెలుసా? ఎక్కడంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి