iDreamPost

పుష్ప విలన్ రోల్‌ని రిజెక్ట్ చేశారా? క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి

Vijay Sethupathi About Pushpa Role: విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. తనదైన నటనతో యావత్ భారత సినీ ప్రేక్షకులను మెప్పించారు. అయితే పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ చేసిన విలన్ పాత్రలో విజయ్ సేతుపతికి నటించే అవకాశం వచ్చిందని.. అయితే దాన్ని రిజెక్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై విజయ్ సేతుపతి స్పందించారు. ఇలాంటి విషయాల్లో నిజం చెప్పకపోవడమే మంచిదంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vijay Sethupathi About Pushpa Role: విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. తనదైన నటనతో యావత్ భారత సినీ ప్రేక్షకులను మెప్పించారు. అయితే పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ చేసిన విలన్ పాత్రలో విజయ్ సేతుపతికి నటించే అవకాశం వచ్చిందని.. అయితే దాన్ని రిజెక్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై విజయ్ సేతుపతి స్పందించారు. ఇలాంటి విషయాల్లో నిజం చెప్పకపోవడమే మంచిదంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పుష్ప విలన్ రోల్‌ని రిజెక్ట్ చేశారా? క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి ఇప్పుడున్న జనరేషన్ కి దొరికిన ఒక మంచి నటుడు. తనదైన పెర్ఫార్మెన్స్ తో, పరిణితి చెందిన నటనతో ఇండియన్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఆయన నటనకు ఫిదా అయిపోయారు. ఆయనను తెలుగు నటుడిగా ఆదరించారు. ఆయన తమిళంలో నటించిన సినిమాలు సైతం చూసేంతగా ఆయన ప్రేరేపించారు. డబ్బింగ్ సినిమాలు వస్తే అస్సలు వదిలిపెట్టరు. తాజాగా ఆయన నటించిన మహారాజా సినిమా విడుదలైంది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విజయ్ సేతుపతి నటనకు పిచ్చెక్కిపోతున్నారు. సినిమా మాస్టర్ పీస్ గా నిలిచిపోతుందని.. విజయ్ సేతుపతి యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ ఉందని అంటున్నారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే మైండ్ బ్లాక్ చేసేలా ఉందని అంటున్నారు.

ఇక ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ మీట్ లో విజయ్ సేతుపతి కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. అదే సమయంలో పుష్ప సినిమా గురించి సంచలన కామెంట్స్ చేశారు. పుష్ప సినిమాలో విలన్ రోల్ కోసం మొదట విజయ్ సేతుపతిని అడిగారని.. అయితే ఆ ఆఫర్ ని విజయ్ సేతుపతి రిజెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే ప్రశ్నను ఓ జర్నలిస్ట్ అడగ్గా.. ఆయన స్పందించారు. తాను పుష్ప సినిమాలో పాత్రను రిజెక్ట్ చేయలేదని అన్నారు. కానీ అన్ని ప్రాంతాల్లో అన్ని సమయాల్లో నిజం చెప్పకూడదని.. లైఫ్ స్పాయిల్ అవుతుందని.. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం మంచిది అని అన్నారు.

దీంతో పుష్ప సినిమాలో ఆఫర్ ని ఈయన రిజెక్ట్ చేసి ఉండడం కానీ ఈయనను రిజెక్ట్ చేసి ఉండడం కానీ జరిగి ఉండవచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలుగు సినిమాల్లో నటించేందుకు చాలా సీరియస్ గా ప్రయత్నించానని.. కానీ ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని అన్నారు. అయితే పుష్ప సినిమాలో పాత్రను రిజెక్ట్ చేయలేదని చెప్పడం.. అదే ప్రెస్ మీట్ లో ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని చెప్పడం.. ఈ రెండు స్టేట్ మెంట్లు బేస్ చేసుకుని చూస్తే విజయ్ సేతుపతిని పుష్ప టీమ్ మొదట్లో అడిగి ఆ తర్వాత తీసేసి ఉండవచ్చునన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. కారణాలు ఏమై ఉండవచ్చునన్నది తెలియదు కానీ ఈ విషయంలో విజయ్ సేతుపతి మాత్రం నిజం చెప్పకపోవడమే మంచిదంటూ కామెంట్స్ చేశారు.

ఒకవేళ పుష్ప సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించి ఉంటే ఫహాద్ ఫాజిల్ కి వచ్చిన దాని కంటే ఎక్కువ పేరు వచ్చేదేమో. పుష్ప2 లో ఈ పాత్ర మరింత హైలైట్ గా నిలవనుంది. ఏది ఏమైనా ఒక మంచి అవకాశాన్ని విజయ్ సేతుపతి కోల్పోయారని అర్థమవుతుంది. ఇక చిరంజీవి నటించిన సైరా సినిమాలో విజయ్ సేతుపతి నటించారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఉప్పెన సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్ళీ సందీప్ కిషన్ మైఖేల్ సినిమాలో నటించారు. తెలుగులో మళ్ళీ అవకాశాలు రాలేదు. మరి ఇప్పటికైనా తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి