iDreamPost
android-app
ios-app

పుష్ప 2 సినిమా కోసం ఫహాద్ ఫాజిల్ భారీ రెమ్యునరేషన్స్ తో పాటు వింత కండిషన్స్

  • Published Jun 17, 2024 | 7:24 PM Updated Updated Jun 17, 2024 | 7:24 PM

Fahadh Faasil: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ మంచి జోష్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన పుష్ప 2 సినిమాకు గాను భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నరని, పైగా ఓ వింత కండిషన్ కూడా పెట్టారని టాక్ సమాచారం వినిపిస్తోంది.

Fahadh Faasil: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ మంచి జోష్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన పుష్ప 2 సినిమాకు గాను భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నరని, పైగా ఓ వింత కండిషన్ కూడా పెట్టారని టాక్ సమాచారం వినిపిస్తోంది.

  • Published Jun 17, 2024 | 7:24 PMUpdated Jun 17, 2024 | 7:24 PM
పుష్ప 2 సినిమా కోసం ఫహాద్ ఫాజిల్  భారీ రెమ్యునరేషన్స్ తో పాటు వింత  కండిషన్స్

హీరో ‘ఫహాద్ ఫాజిల్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాగా, మలయాళ స్టార్ హీరోల్లో ఫహాద్ ఫాజిల్ కూడా ఒకరు. అయితే పేరుకు మలయాళ నటుడు అయినా ఫహాద్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే ఈయన మలయాళంతో పాటు తమిళ్, తెలుగు వంటి భాషల్లో నటించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా.. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తెలుగు తెరపై విలన్ గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. కాగా, ఇటీవలే ఫహద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమాతే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆ సినిమా మంచి సూపర్ హిట్ గా నిలిచి మంచి విజయాన్ని అందుకుంది.ఇదిలా ఉంటే..తాజాగా ఈ హీరో చాలా కమర్షియల్ అయిపోయాడని, పైగా ఎంతలా అంటే.. ఒక రోజుకు అన్నీ లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటాడని సమాచారం వినిపిస్తుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ మంచి జోష్ లో దూసుకుపోతున్నాడు. నిజానికి ఫాహాద్ ఫాజిల్ మూవీస్ ను చాలా వేగంగా పూర్తి చేస్తాడు. ఈ క్రమంలోనే.. ప్రతి నాలుగు నెలలకు ఒక సినిమా  సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక అందుకు తగ్గట్టుగానే మూవీస్ కూడా మంచి హిట్ ట్రాక్ లో పడుతున్నాయి. దీంతో ఈ హీరో బాగా కమర్షియల్ అయిపోయడనే సమాచారం అందిందది. అది  ఎంతలా అంటే హిట్ పడటమే లేటు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అసలే పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కావడంతతో.. రెమ్యునరేషన్ విషయంలో అందరికీ షాకిస్తున్నాడు.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ ‘పుష్ప 2’లో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీకి గాను ఫహాద్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా రోజువారీగా  తీసుకుంటున్నట్లు సమాచారం. పైగా దీనికి కొన్ని వింత కండీషన్స్ కూడా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకి అదేమిటంటే.. ఈ హీరో రోజుకి రూ.12 లక్షల‍్ని రెమ్యునరేషన్‌గా ఫిక్స్ చేశారట. ఒకవేళ తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్ రద్దయితే మాత్రం అదనంగా మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకి రూ.14 లక్షలు ఇవ్వాల్సి ఉంటుదని సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మూవీ షూట్ క్యాన్సిల్ చేయకుండా కచ్చితంగా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఫహాద్.. పుష్ప నిర్మాతలకు ఈ కండీషన్ పెట్టి ఉండోచ్చని అభిప్రాయపడుతున్నారు. మరీ, పుష్ప 2 సినిమాకు గాను ఫహాద్ ఫాజిల్ పెట్టిన కండిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet