iDreamPost
android-app
ios-app

ఆ కారణంతోనే తెలుగు సినిమాల్లో నటించడం లేదు: విజయ్ సేతుపతి

  • Published Jun 19, 2024 | 12:53 PMUpdated Jun 19, 2024 | 12:53 PM

Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తాజాగా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా.. మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి తాను తెలుగు సినిమాల్లో ఆ కారణంతోనే నటించడం లేదని పేర్కొన్నారు.

Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తాజాగా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా.. మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి తాను తెలుగు సినిమాల్లో ఆ కారణంతోనే నటించడం లేదని పేర్కొన్నారు.

  • Published Jun 19, 2024 | 12:53 PMUpdated Jun 19, 2024 | 12:53 PM
ఆ కారణంతోనే తెలుగు సినిమాల్లో నటించడం లేదు: విజయ్ సేతుపతి

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజయ్ సేతుపతి.. గత వారం పది రోజులుగా ఈ పేరు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పేరుకే కాదు ఆయన నటించిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇకపోతే తాజాగా విజయ్ సేతుపతి మహారాజా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా జూన్ 14వ తేదీ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా, యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించాడు. అయితే ఇందులో మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యపఫ్, అభిరామి కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే..విజయ్ సేతుపతి మహారాజ సినిమా విడుదల దగ్గర నుంచి వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తరుచు రోజుకో అంశంతో నెట్టింట వైరల్ అవుతున్నారు.ఈ క్రమంలోనే.. తాజాగా విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదో పేర్కొన్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తాజాగా మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా.. మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు విజయ్ సేతుపతి. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి తాను తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను తెలుగు సినిమాల్లో నటించి భాగం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక అందుకోసం చాలా కథలు కూడా విన్నాను. కానీ, వాటిలో కొన్ని నాకు చాలా నచ్చాయి. అయితే అందులో నాకు ఇచ్చిన పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇక ఇక్కడ వారు నాకు అందిస్తున్న కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వారు ఆఫర్‌ చేసిన పాత్రకు నేను సెట్‌ కానని భావించడం వంటి కారణాలతో తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాను. కానీ, భవిష్యత్తులో నాకు సెట్‌ అయ్యే పాత్ర ఇక్కడ దొరుకుతుందని ఆశిస్తున్నాను అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి తెలుగులో సినిమాలు చేయకపోవడానికి చెప్పిన కారణం నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీ ఇప్పటికే రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి సంచలనం సృష్టించింది. మరి, విజయ్ సేతుపతి తెలుగులో సినిమాలు చేయకపోవడానికి తెలిపిన కారణం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి