iDreamPost

9 ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్న ప్రముఖ నటి! పోస్ట్ వైరల్..

పెళ్లైన 9 సంవత్సరాలకు తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది ప్రముఖ నటి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

పెళ్లైన 9 సంవత్సరాలకు తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది ప్రముఖ నటి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

9 ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్న ప్రముఖ నటి! పోస్ట్ వైరల్..

సెలబ్రిటీలు తమ లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, బుల్లితెర నటి త్వరలోనే తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది. దాంతో ఈ నటికి బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిజేస్తున్నారు. అక్టోబర్ లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపింది. ఇంతకీ ఆ నటి ఎవరు? తెలుసుకుందాం పదండి.

బాలీవుడ్ భామ, బుల్లితెర నటి ద్రష్టి ధామి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను తల్లికాబోతున్నట్లు, అక్టోబర్ లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. దాంతో ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు ప్రముఖ సెలబ్రిటీలు. కాగా.. 2015లో ద్రష్టి ధామి నీరజ్ ఖేమ్కాను పెళ్లి చేసుకుంది. 9 సంవత్సరాల తర్వాత వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు.

ఇక ద్రష్టి కెరీర్ విషయానికి వస్తే.. 2007లో దిల్ మిల్ గయే సీరియల్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియేలో కూడా పాల్గొంది. ‘మధుబాల, ఏక్ ఇష్క్ ఏ జూనున్’ సీరియల్స్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇందులో ద్రష్టి వివియన్ దేనాకు జంటగా నటించింది. ఇటీవలే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో ది ఎంపైర్, దురంగ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. పెళ్లైన దాదాపు 9 ఏళ్లకు తల్లికాబోతుండటంతో.. మురిసిపోతుంది ద్రష్టి. తన బిడ్డకు ఆశీస్సులు అందించాలని అభిమానులను కోరుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Drashti Dhami 💜 (@dhamidrashti)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి