iDreamPost

వీడియో: నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ యువతి రచ్చ.. సజ్జనార్ రియాక్షన్ ఇదే?

సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం ఓ యువతీ నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ నానా రచ్చ చేసింది. నెట్టింటా వైరల్ గా మారిన ఈ వీడియోపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం ఓ యువతీ నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ నానా రచ్చ చేసింది. నెట్టింటా వైరల్ గా మారిన ఈ వీడియోపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

వీడియో: నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ యువతి రచ్చ.. సజ్జనార్ రియాక్షన్ ఇదే?

సోషల్ మీడియా కొంత మందికి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుండగా మరికొంత మందికి ఉపాధిని అందిస్తోంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొంతమంది యువతీ యువకులు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ జనాలు అసహనానికి గురయ్యేలా చేస్తున్నారు. తాజాగా ఓ యువతి నడిరోడ్డుపై డ్యాన్స్ తో రచ్చ చేస్తూ తీవ్ర విమర్శలపాలైంది. ఈ ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. పనికి వచ్చే పనులు చేయండి అంటూ యువతకు చురకలంటించారు.

సోషల్ మీడియాలో లైక్ ల కోసం, వ్యూస్ కోసం వింతగా ప్రవర్తిస్తున్నారు. ఎలాగైన ఫేమ్ తెచ్చుకునేందుకు ఇష్టారీతిలో వీడియోలు చేస్తున్నారు. చూసే జనాలు ఓర్నీ వీళ్లకు ఇదేం పైత్యం రా బాబూ అంటూ విసుక్కునేలా చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర పబ్లిక్ ప్లేస్ లల్లో డ్యాన్స్ లు చేస్తూ.. వెకిలి చేష్టలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదే రీతిలో ఓ యువతీ నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై డ్యాన్స్ చేసింది. వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందనే సోయి లేకుండా ప్రవర్తించింది. కాలేజీ బ్యాగును పక్కన పడేసి నడిరోడ్డుపై పడుకుని అసహ్యంగా స్టెప్పులు వేసింది. ఆ యువతి డ్యాన్స్ చేస్తున్నంత సేపు వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారడంతో సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ రియాక్ట్ అయ్యారు.

సజ్జనార్ తన్ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు.. ‘నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనదంమో.. ఏమో!? అంటూ అసహనం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్లేస్ లల్లో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ యువతలో మాత్రం మార్పు రావడం లేదు. మరి నడిరోడ్డుపై యువతి డ్యాన్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి