iDreamPost

గ్రూప్-1 అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి చేర్చి గొప్ప మనసు చాటుకున్న RTC డిపో మేనేజర్!

RTC Depot Manager Humanity: గ్రూప్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అభ్యర్థులు రాత్రీ పగలు అనే తేడా లేకుండా కష్టపడి చదువుతారు. అలాంటిది పరీక్ష హాలుకు ఆలస్యం అయితే.. పరీక్ష రాయడానికి ఛాన్స్ ఉండదు.

RTC Depot Manager Humanity: గ్రూప్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అభ్యర్థులు రాత్రీ పగలు అనే తేడా లేకుండా కష్టపడి చదువుతారు. అలాంటిది పరీక్ష హాలుకు ఆలస్యం అయితే.. పరీక్ష రాయడానికి ఛాన్స్ ఉండదు.

గ్రూప్-1 అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి చేర్చి గొప్ప మనసు చాటుకున్న RTC డిపో మేనేజర్!

తెలంగాణ లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. నిన్న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వకు పరీక్షలు జరిగాయి. అయితే ఉదయం 10 గంటల లోపే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాల్సిందిగా అధికారులు సూచించిన విషయం తెలిసిందే.  ఒక్క నిమిషం లేట్ అయినా పరీక్షలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అధిక శాతం గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల పరిధిలో ఉన్నాయి.  ఈ క్రమంలో గూప్ -1 రాసేందుకు వచ్చిన అభ్యర్థినికి అనుకోని సంఘటన ఎదురైంది.. ఆ సమయంలో ఆర్టీసీ డిపో మేనేజర్ గొప్ప మనసు చాటుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన నిషిత అనే యువతి గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ చేసేందుకు ఆదివారం బయలుదేరింది. ఆమెకు సుల్తాన్ బజార్‌లోని ప్రగతి మహా విద్యాలయంలో ఎగ్జామ్ సెంటర్ పడింది. ఈ క్రమంలోనే కోఠీ లోని బస్సు దిగాల్సింది పోయి.. కన్ఫ్యూజ్‌లో అబిట్స్ చర్మాస్ వద్ద బస్సు దిగింది. అప్పటికే పరీక్ష సమయంలో మించి పోతుంది.. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఏం చేయాలో అర్థం కంగారు పడుతున్న ఆమెను చూసిన కాచిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ రఘు గమనించారు. ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వెంటనే తన కారులో నిషితను తీసుకు వెళ్లి పరీక్షా కేంద్రానికి పది నిమిషాల ముందుగానే చేర్చాడు.

సకాలంలో గ్రూప్ 1 అభ్యర్థిని ఎగ్జామ్ సెంటర్ కి తీసుకు రావడంపై నిషిత తో పాటు అక్కడ ఉన్న అధికారులు, తోటి అభ్యర్థులు డిపో మేనేజర్ రఘు కి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. 3.02 లక్షల మంది పరీక్షలకు హాజరైనట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. కొంతమంది అభ్యర్థులు ఆలస్యం కారణంగా పరీక్ష కేంద్రం నుంచి నిరాశతో వెనుదిరిగిన సంఘటనలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కొంది మంది విద్యార్థును  సరైన సమయానికి పరీక్ష కేంద్రాలకు తీసుకువచ్చి మంచి మనసు చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి