iDreamPost

విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల!

Junior College Admission Start: ఇటీవల పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ లో చేరేందుకు ఆడ్మీషన్లు ప్రారంభమయ్యాయి.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..

Junior College Admission Start: ఇటీవల పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ లో చేరేందుకు ఆడ్మీషన్లు ప్రారంభమయ్యాయి.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..

విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల!

ఏప్రిల్ 30వ తేదీ తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాలను తెలంగాణ ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులు విడుదల చేశారు. మార్చి నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. విడుదలైన ఫలితాల్లో బాలురు 89.41 శాతం, బాలికలు 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఫలితాలు బాగానే వచ్చాయంటున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,927 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. అయితే 6 ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం సున్నా ఫలితాలు నమోదు అయ్యాయి. నిర్మల్ జిల్లా 99.06 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. వికారా‌బాద్ జిల్లా 66 శాతంత అత్యల్పంగా ఫలితాలను సాధించినట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో జూనియర్ కాలేజ్ లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేసింది. పదవ తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా కాలేజీల్లో ప్రవేశాలు కల్పించబడాయి. మే 9 గురువారం నుంచి తొలిదశ ఇంట్మర్మీడియట్ అడ్మీషన్లు ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు బుధవారం అధికారికంగా ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, సాంఘిక సంక్షేమ, గిరిజన, మైనార్టీ గురుకులాలు, మోడల్ జూనియర్ కాలేజ్ ల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. పదవ తరగతి పాస్ అయిన వారు మార్కులు మోమో,  టీసీ, స్థానిక నివాస ధృవీకరణ పత్రం ఆధారంగా ప్రిన్సిపాళ్లు ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించాల్సిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా బుధవారం ప్రకటించారు.

ఇంటర్ లో చేరే విద్యార్థులు అన్ని సర్టిఫికెట్స్ రెడీ చేసుకొని దరఖాస్తు చేసుకునేందుకు సిద్దంగా ఉండాలి తెలిపారు. దరఖాస్తుల జారీ, స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం అవుతుంది. మే 9వ తేదీ నుంచి మే 31 వ తేదీ వరకు దరఖాస్తులను ఇంటర్ కాలేజీల్లో స్వీకరించనున్నారు. జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం అవుతాయని ఇంటర్ మీడియట్ బోర్డ్ తెలిపింది. జూన్ 30 నాటికి తొలిదశ అడ్మీషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపింది.  అయితే సెకండ్ ఫేజ్ అడ్మీషన్ల షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది.  కాలేజీల్లో మంజూరైన ప్రతి సెక్షన్ లో 88 మందిని చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు అవసరమైతే బోర్డు అనుమతి తీసుకోవాలి. దీన్ని ఉల్లంఘించిన కళాశాలలకు జరిమానాతో పాటు గుర్తింపు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి