iDreamPost

డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు!

Good News for DSC Candidates: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Good News for DSC Candidates: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు!

తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో రెండు పథకాలు అమలు చేశారు. మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. అంతేకాదు రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టారు. ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024 విడుదల చేశారు. తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఇటీవల తెలంగాణలో టీఎస్ డీఎస్సీ నోటిఫికెషన్ 2024 రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎస్టీలు 6,508, స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరిలో స్కూల్ అసిస్టెంట్స్ 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మార్చి 4 వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభం అయ్యింది. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఫీజు చెల్లింపు గడువు ముగియనున్న నేపథ్యంలో తాజాగా గడవును పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

DSC

కొత్త షెడ్యూల్ ప్రకారం వచ్చే జూన్ 20వ తేదీ వరకు ఛాన్స్ కల్పించారు. దీంతో అభ్యర్తులు రూ. 1000 చోప్పున అప్లికేషన్ ఫీజు చెల్లించి జూన్ 20 రాత్రి 11:50 గంటల వరకు ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. జులై 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ డీఎస్సీ ప్రకటన రద్దు చేస్తూ పోస్టుల సంఖ్యను 11,062 కు పెంచి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో డీఎస్సీ అభ్యర్థులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి