iDreamPost

వెళ్ళిపోయిన కూతురికి కోసం.. నడి రోడ్డుపై కన్నతల్లి కన్నీరు!

తల్లి..తన బిడ్డలను ఎంతో అపురూపంగా పెంచుకుని పెద్ద చేస్తుంది. వారికి ఏ చిన్న కష్టం వచ్చిన అమ్మ అల్లాడిపోతుంది. అలానే 15 రోజులగా కనిపించుకుండా పోయినా తన బిడ్డ కోసం ఓ తల్లి ఎంతో ఆరాట పడుతుంది.

తల్లి..తన బిడ్డలను ఎంతో అపురూపంగా పెంచుకుని పెద్ద చేస్తుంది. వారికి ఏ చిన్న కష్టం వచ్చిన అమ్మ అల్లాడిపోతుంది. అలానే 15 రోజులగా కనిపించుకుండా పోయినా తన బిడ్డ కోసం ఓ తల్లి ఎంతో ఆరాట పడుతుంది.

వెళ్ళిపోయిన  కూతురికి కోసం.. నడి రోడ్డుపై కన్నతల్లి కన్నీరు!

తల్లిదండ్రులకు తమ బిడ్డలపై ఉంటే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ బిడ్డలను పెంచి పెద్ద చేస్తుంటారు. ముఖ్యంగా బిడ్డల సంతోషంగా తల్లి ఎంతో ఆరాట పడుతుంది. అలాంటి తల్లి..తన బిడ్డ క్షణం పాటు కనిపించకుంటే అల్లాడి పోతుంది. బిడ్డ దొరికే వరకు పోరాటం చేస్తుంది. అలానే ఓ తల్లి కూడా తన 17 ఏళ్ల కూతురి కోసం ఆరాట పడుతుంది. 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తన బిడ్డ కోసం ఆ తల్లి ఎండలను సైతం లెక్క చేయకుండా పోరాడుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని డీఎస్పీ పాత కార్యాలయ సమీపంలో త్రివేణి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఓ 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ పాపను అదే ప్రాంతంలో నివాసముంటున్న రాజు అనే యువకుడు ఎత్తుకెళ్లాడని త్రివేణి చెబుతున్నారు. తన బిడ్డను తీసుకెళ్లిన ఘటనపై 15 రోజుల క్రితమే బాలిక తల్లి త్రివేణిదేవి కల్యాణ్ దుర్గం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అయితే రోజులు గడుస్తున్న త్రివేణి బిడ్డ ఆచూకి మాత్రం తెలియరాలేదు. తన బిడ్డ గురించి ఏమైనా సమాచారం తెలిసిందేమోనని నిత్యం పోలీస్ స్టేషన్ కు వచ్చేది. అలా బిడ్డ కనిపించకుండా పోయిన రోజూ నుంచి రోజూ పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరిగినా త్రివేణి కుమార్తెను గురించిన ఏ వివరాలు తెలియరాలేదు. దీంతో పోలీసుల తీరుపై విసుగు చెందిన త్రివేణి దారుణ నిర్ణయం తీసుకుంది.

Mother's tears for the daughter who left

బుధవారం ఉదయం మరోసారి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి..తన కుమార్తె ఆచూకీ గురించి పోలీసులను ఆరా తీసింది. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. చివరకు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి కూర్చుకుంది. మండుటెండను సైతం లెక్క చేయకుండా.. పోలీస్ స్టేషన్ బయట కూర్చుకని తన కుమార్తె ఆచూకీ తెలపాలంటూ పోలీసులను వేడుకుంది. తన బిడ్డను మాయమాటలతో లోబర్చుకుని రాజు అనే యువకుడు అపరించుకెళ్లాడని ఆమె తెలిపింది.  అంతేకా రాజు, అతని కుటుంబసభ్యులు తన బిడ్డను చిత్రహింసలకు గురి చేస్తూ.. ఆ వీడియోలు సైతం పంపిస్తున్నారని త్రివేణి కన్నీరుమున్నీరుగా విలపించింది.

తన ఫిర్యాదును పక్కదారి పట్టేలా పోలీసులను సైతం రాజు కుటుంబసభ్యులు, అతడి బంధువులు ప్రభావితం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై తన కుమార్తెను తన వద్దకు చేర్చకపోతే ఆత్మహత్య  చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ ఆవేదన చెందింది. అలా మండుటెండలో బిడ్డ కోసం పోరాడుతున్న ఆ తల్లిని చూసి స్థానికులు చలించిపోయారు. మొత్తంగా కనిపించకుండా పోయినా కుమార్తె కోసం తల్లి పడుతున్న ఆరాటం  స్థానికంగా సంచలనంగా మారింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి