iDreamPost

దారుణం.. కోడలిపై కోపంతో సొంతమనవడినే చంపిన అత్త!

  • Published Nov 27, 2023 | 11:09 AMUpdated Nov 27, 2023 | 11:09 AM

ఈ మద్య కొంతమంది చిన్న విషయాాలకే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పలు నేరాలకు పాల్పపడుతున్నారు.

ఈ మద్య కొంతమంది చిన్న విషయాాలకే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పలు నేరాలకు పాల్పపడుతున్నారు.

  • Published Nov 27, 2023 | 11:09 AMUpdated Nov 27, 2023 | 11:09 AM
దారుణం.. కోడలిపై కోపంతో సొంతమనవడినే చంపిన అత్త!

ఈ మద్య కొంతమంది చిన్న విషయాలకే తీవ్రంగా మనస్థాపానికి గురికావడం.. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దారుణంగా దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు కారణం ఎక్కువగా ఆర్థిక వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, పని ఒత్తిడి, ఒకరిపై ఒకరు ఆదిపత్యం చేలాయించే క్రమంలో ఇలాంటి సంఘటలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు సొంత బంధువులు అని కూడా చూడకుండా అన్యాయంగా ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. కోడలి పై కోపంతో ఉన్న ఓ అత్త ఎవరూ ఊహించని దారుణానికి పాల్పపడింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటకలో దారుణ సంఘట చోటు చేసుకుంది. అత్తా కోడళ్ల మధ్య కొనసాగిన ఆదిపత్య పోరులో ఓ చిన్నారి ప్రాణం బలి అయ్యింది. కర్ణాటకలోని గదగ్ జిల్లా గజేంద్ర నగర్ కి చెందిన సరోజా గూలీ అనే మహిళ తన సొంత మనవడిని చాకుతో పొడిచి చంపిన ఘటన తీవ్ర కలకలం చేపింది. వివరాల్లోకి వెళితే.. సరోజా గూలీ-నాగరత్నం ఇద్దరూ అత్తా కోడళ్ళు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఆదిపత్య పోరులో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, తిట్టుకోవడం.. కొన్నిసార్లు కోట్టుకోవడం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే నాగరత్నం తన తల్లిదండ్రుల ఇంటివద్ద ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అద్విక్ కి జన్మనిచ్చింది. చిన్న పిల్లాడిని చూసుకుంటూ ఆరు నెలల పాటు తల్లిగారి ఇంటివద్దేనే ఉంది నాగరత్నం. మూడు నెలల క్రితం అత్తగారింటికి తిరిగి వచ్చింది.

బాబు జన్మించడంతో నాగరత్నాన్ని ఆమె భర్త సంతోషంగా చూడటం మొదలు పెట్టాడు. ఇది సహించలేకపోయింది సరోజా.. ఈ క్రమంలోనే ఆమెపై పగ పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 22న బయట పని నిమిత్తం నాగరగ్నం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా కొడుకు కనిపించకుండా పోయాడు. దీంతో అత్త సరోజని అడిగితే సరైన సమాధానం రాలేదు. ఆమెపై అనుమానంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి అత్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని తమదైన స్టైల్లో సరోజాని ప్రశ్నించడంతో తనే నేరం చేసినట్లు ఒప్పుకుంది. పసికందు ను గొంతుకోసం చంపి మడ అడవుల్లో పాతిపెట్టినట్లు ఒప్పుకుంది. ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లి పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్ష కోసం పంపారు. అత్త ఇంత దారుణానికి ఒడికడుతుందని భావించలేదని నాగరత్నం కన్నీరు మున్నీరయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి