Arjun Suravaram
Karnataka: ఎంతో మంది పోలీలుసు నిజాయితీ పని చేస్తూ.. తమ వద్దకు వచ్చే బాధితులకు న్యాయం అందిస్తుంటారు. కొన్ని సార్లు విధుల్లో కాఠిన్యం చూపిస్తూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే అలాంటి వారి కాఠిన్యం వెనుక కూడా మంచి మనస్సు దాగి ఉంటుంది.
Karnataka: ఎంతో మంది పోలీలుసు నిజాయితీ పని చేస్తూ.. తమ వద్దకు వచ్చే బాధితులకు న్యాయం అందిస్తుంటారు. కొన్ని సార్లు విధుల్లో కాఠిన్యం చూపిస్తూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే అలాంటి వారి కాఠిన్యం వెనుక కూడా మంచి మనస్సు దాగి ఉంటుంది.
Arjun Suravaram
సాధారణంగా పోలీసులు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది..వారిలోని కాఠిన్యం. విధి నిర్వహణలో పోలీసులు అలా ఉండాల్సి వస్తుంది. ప్రజల రక్షణ కోసం రేయింబవళ్లు విధులు నిర్వహిస్తుంటారు. అలానే ఎంతో మంది పోలీలుసు నిజాయితీ పని చేస్తూ.. తమ వద్దకు వచ్చే బాధితులకు న్యాయం అందిస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. కొన్ని కొన్ని సార్లు విధుల్లో కాఠిన్యం చూపిస్తూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే అలాంటి వారి కాఠిన్యం వెనుక కూడా మంచి మనస్సు దాగి ఉంటుంది. అలాంటి ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో కాఠిన్యం చూపిన ఓమహిళా ఎస్సై.. ఆ వెంటేనే అక్కడి పరిస్థితిని గమనించి మంచి మనస్సును చూపింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం…
మంగళవారం కర్నాటక రాష్ట్రంలోని బాగల్ కోటలోని ఓ ప్రాంతంలో ఓ మహిళా ఎస్సై విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆ మార్గంలో ముగ్గురు యువకులు బైక్ పై ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తున్నారు. ఆ ముగ్గురిని గమనించి సదరు మహిళా ఎస్సై..వారి బైక్ ను ఆపింది. అంతేకాక వారి దగ్గర బండికి సంబంధించిన పత్రాలను అడిగింది. ఈ క్రమంలోనే ఆ యువకుల నుంచి సరైన సమాధానం రాకపోవడం వారికి చలాన విధించింది. ఇక అదే సమయంలో ఆ ముగ్గురు యువకుల్లో ఒకడి వద్ద మాత్రమే డబ్బులు ఉన్నాయి. దీంతో వాడి వద్ద నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే ఆ యువకుడు బోరున ఏడవడం ప్రారభించాడు. అతడు ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికి అర్థం కాలేదు. వెంటనే ఆ మహిళా ఎస్సై..ఆ యువకుడి ప్రశ్నించింది.కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్తున్నామని, ఆ డబ్బులు మాత్రమే తమ వద్ద ఉన్నాయని ఆమెకు చెప్పి ఏడుస్తున్నాడు. దీంతో ఎస్సై అప్పటి వరకు ఉన్న లాఠీ కాఠిన్యం స్థానే స్త్రీ సహజాతమైన లాలిత్యం తొంగి చూసింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న కుర్రాడిని అమ్మాలా తన వద్దకు అక్కున చేర్చుకుని ఓదార్చింది. అంతేకాక వారి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేసి.. ఆమె అదనంగా మరో రూ.200 ఇచ్చింది.
దీంతో ఆ మహిళా ఎస్సైతో ఆ కుర్రాళ్లు మరోసారి ఇలాంటి తప్పు చేయమంటూ చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ మహిళా ఎస్సై ను చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు ప్రశంసలు కురింపించారు. అప్పటి వరకు ఎంతో కఠినమైన మనిషిలాగా ఆ యువకులు ప్రవర్తిచం చూసి.. కాసేపటికే సొంతం అమ్మాలా ఆ పిల్లలకు లాలించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి..ఈ మహిళా ఎస్సైను మీరు ప్రశంసించాలంటే..కామెంట్స్ రూపంలో తెలియజేయండి.