iDreamPost

అర్ధరాత్రి ఫోన్‌ రావడంతో బయటకు వెళ్లింది.. ఆపై

యువతులు తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటారు.  అందుకు తగినట్లే చాలా మందికి తమ వివాహ బంధంతో సంతోషంగా ఉంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో కొందరి యువతుల విషయంలో ఘోరాలు చోటుచేసుకుంటాయి.

యువతులు తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటారు.  అందుకు తగినట్లే చాలా మందికి తమ వివాహ బంధంతో సంతోషంగా ఉంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో కొందరి యువతుల విషయంలో ఘోరాలు చోటుచేసుకుంటాయి.

అర్ధరాత్రి ఫోన్‌ రావడంతో బయటకు వెళ్లింది.. ఆపై

ప్రతి ఒక్కరు తమ వివాహ బంధంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ముఖ్యంగా యువతులు అయితే తమ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటారు.  అందుకు తగినట్లే చాలా మందికి తమ వివాహ బంధంతో సంతోషంగా ఉంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో కొందరి యువతుల విషయంలో ఘోరాలు చోటుచేసుకుంటాయి.పెళ్లైన కొంతకాలినేక ఆత్మహత్య,హత్య,  అనుమానస్పదరీతిలో మృతి చెంది కనిపిస్తుంటారు. ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఫోన్ రావడంతో బయటకు వెళ్లిన వివాహిత చివరికి అనుమాస్పద రీతిలో మరణించిది. ఇక పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం…

 ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లాలోని గజపతి నగరంలో బంగారమ్మ కాలనీలో అనూష అలియాస్ తనూజ(22) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. ఇక తమ బిడ్డకు పెళ్లి చేసిన ఆనందంతో ఆ యువతి తల్లిదండ్రులు ఉన్నారు. ఆమె భర్త ఆర్మీలో  పని చేస్తున్నాడు. ఇక తన వివాహ బంధంపై ఆ యువతి ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకు తగినట్లే తన భర్తతో నాలుగు నెలలగా సంతోషంగా ఉంటుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అనుమానస్పద స్థితిలో ఆమె మరణించింది.

ఆదివారం గ్రామ దేవత పండగ ఉండటంతో తనూజ పుట్టింటికి వచ్చింది. రాత్రి 10 గంటల వరకు తనూజ ఇంట్లోనే ఉంది. అయితే అదే సమయంలో ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇక ఎంతసేపటికి ఆమె ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. రాత్రంతా కనపడపోవడంతో కుటుంబీకులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలోనే వారి ఇంటి సమీపంలోని పశువుల పాగ వద్ద  తనుజా విగతజీవిగా పడిఉందని స్థానికులు గుర్తించారు. వెంటనే మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకున్నారు. తనూజ మృతదేహం చూసి.. ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  ఇది ఇలా ఉంటే.. ఆమె ఇంటి నుంచి వెళ్లిన తర్వాత తన స్నేహితురాలికి, సోదరుడికి మేసేజ్ పంపించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

గతంలో ఆమెకు క్లోజ్ గా ఉండే ఓ యువకుడు ఫొటోలు, వీడియోల పేరిట బెదిరిస్తున్నాడని చెప్పిందని, అంతేకాక తన భర్తకు పంపిస్తాడన్న భయంతో చనిపోతున్నట్లు ఆమె మేసేజ్ లో పేర్కొందన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అర్ధరాత్రి సమయంలో సదరు యువకుడి ఇంటికి వెళ్లిన బాధితురాలి బంధువులు అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారని,  ప్రస్తుతం వారు గజపతినగరం ఆసుపత్రిలో చేరడంతో వివరాలు ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి