iDreamPost

సోషల్‌ మీడియాలో ఇలాంటి కామెంట్లు పెడితే జైలుకే..

సోషల్‌ మీడియాలో ఇలాంటి కామెంట్లు పెడితే జైలుకే..

సోషల్‌ మీడియాలో స్వేచ్ఛకు హద్దులు లేకుండా పోతున్నాయి. కొందరు నెటిజన్లు తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవటం.. అభ్యంతరకర పోస్టులు పెట్టడం.. సెలెబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ కామెంట్లు, పోస్టులు పెట్టడం సర్వ సాధారణంగా జరుగుతోంది. అయితే, రాజకీయాలకు సంబంధించి పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే జైలుకెళ్లటం ఖాయం. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే వారు కొంచెం వెనకా ముందు ఆలోచించుకోవాల్సిందే.

అభ్యంతరకరమైన, మనోభావాలను దెబ్బతీసేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉండే పోస్టులు చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాటిని షేర్‌ చేయడం, కామెంట్‌ చేయటం లాంటివి చేయవద్దని సూచిస్తున్నారు. సాధారణ సమయంలో సోషల్ మీడియాల్లో  అసభ్యకరంగా పోస్టులు పెడితే ఫైల్‌ అయ్యే కేసులకు, ఎలక్షన్‌ టైంలో ఫైల్‌ అయ్యే కేసులకు తేడా ఉంటుందని అన్నారు. ఎలక్షన్‌ టైంలో ఫైల్‌ అయ్యే కేసులు చాలా బలంగా ఉంటాయన్నారు.

 కఠినమైన సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అందుకే సోషల్‌ మీడియా వాడే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కాగా, తెలంగాణలో నవంబర్‌ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 5వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండనుంది. అప్పటి వరకు ప్రతీ పార్టీ పలు నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరి, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న ఈ సమయంలో అభ్యంతరకర పోస్టులు చేయొద్దంటున్న పోలీసుల శాఖ హెచ్చరికలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి