iDreamPost
android-app
ios-app

OTT Web Series: పాలిటిక్స్ అంటే ఇష్టమా? ఈ వెబ్ సిరీస్ మిస్ కావద్దు! తెలుగులో కూడా స్ట్రీమింగ్!

  • Published May 03, 2024 | 1:37 PMUpdated May 03, 2024 | 1:50 PM

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు ఎలాంటి క్రేజ్ పెరుగుతుందో చూస్తూనే ఉన్నాము. మరి అందులోను ఆ వెబ్ సిరీస్ రాజకీయాలకు సంబంధించింది అయితే,అది కూడా తెలుగులో ఉంటె చూసేందుకు మరింత ఆసక్తిగా ఉంటుంది. అలాంటి ఓ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ లోకి రాబోతుంది.

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు ఎలాంటి క్రేజ్ పెరుగుతుందో చూస్తూనే ఉన్నాము. మరి అందులోను ఆ వెబ్ సిరీస్ రాజకీయాలకు సంబంధించింది అయితే,అది కూడా తెలుగులో ఉంటె చూసేందుకు మరింత ఆసక్తిగా ఉంటుంది. అలాంటి ఓ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ లోకి రాబోతుంది.

  • Published May 03, 2024 | 1:37 PMUpdated May 03, 2024 | 1:50 PM
OTT Web Series: పాలిటిక్స్ అంటే ఇష్టమా? ఈ వెబ్ సిరీస్ మిస్ కావద్దు! తెలుగులో కూడా స్ట్రీమింగ్!

వెబ్ సిరీస్ లకు ఈ మధ్య మరింత ఆదరణ లభిస్తుంది. దీనితో మేకర్స్ కూడా వెబ్ సిరీస్ లను మరింత ఇంట్రెస్టింగ్ గా కొత్త కొత్త కంటెంట్ తో ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఎవరిని కదిలించిన పొలిటికల్ వార్తలే బయటకు వస్తున్నాయి. మరి ఇంత హీట్ మూమెంట్ లో .. రాజకీయాలకు సంబంధిచిన ఓ వెబ్ సిరీస్ వస్తే, అది కూడా తెలుగులో ఉంటె ఇంకా ప్రేక్షకులకు.. అంతకంటే ఎంటర్టైన్మెంట్ మరొకటి ఉండదు. త్వరలో అలాంటి ఓ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రాబోతుంది. సాధారణంగా ఇటువంటివి అన్నీ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని చిత్రకరిస్తూ ఉంటారు. ఇది కూడా అంతే. మరి ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం

ఈ సిరీస్ మరేదో కాదు.. సలార్ మూవీ ఫేమ్ శ్రీయ రెడ్డి, కాంతారా కిషోర్ ప్రధాన పాత్రలలో తమిళంలో నటిస్తున్న “త‌లైమై సేయ‌ల‌గం”. తమిళనాడు రాజకీయాలు.. అక్కడ ఎటువంటి చర్చలకు దారి తీస్తున్నాయనేది తెలియనిది కాదు. ఇప్పుడు అలాంటి ఓ కథనే వెబ్ సిరీస్ ద్వారా అందరి ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సిరీస్ కు నేషనల్ అవార్డు విన్నర్ వసంత బాలన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో శ్రీయ రెడ్డితో పాటు భ‌ర‌త్‌, ర‌మ్య నంబీశీన్‌, ద‌ర్శ‌న గుప్తా, క‌స్తూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ సిరీస్ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 ఓటీటీ లో మే 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. పైగా ఈ సిరీస్ ను తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సిరీస్ రిలీజ్ తర్వాత ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

పొలిటికల్ అంశాలతో రిలీజ్ చేసిన ఈ సిరీస్ టీజర్.. అందరికి ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఈ సిరీస్ లో ప్రతిపక్ష నాయకురాలిగా శ్రీయ రెడ్డి కనిపించనుంది. ఇక సామాన్య ప్రజల తరపున పోరాడే తిరుగుబాటుదారుడిగా భరత్ కనిపించనున్నాడు. తమిళ రాజకీయాల అసలు రంగును ఈ సిరీస్ ద్వారా అందరికి తెలియపరిచే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక వసంత బాలన్ విషయానికొస్తే.. దర్శకుడిగా అతనికి ఇదే మొదటి వెబ్ సిరీస్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, మరి ఈ వెబ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి