హీరోలకు, అభిమానులు విడదీయరాని సంబంధం ఉంటుంది. తమ హీరోకు గాయం అయితే అయ్యో అంటూ.. తల్లడిల్లిపోతారు అభిమానులు. అలాగే తమ అభిమానులకు ఏమైనా కష్టం వస్తే.. మేమున్నామంటూ ముందుకు వచ్చి చేయూత ఇస్తారు మన హీరోలు. అలాగే తన అభిమానులు అయిన 100 కుటుంబాలకు ‘ఖుషి’ సినిమాను హిట్ చేసినందుకు కోటి రూపాయాలను ప్రకటించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 100 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు వైజాగ్ సక్సెస్ మీట్ లో ప్రకటించాడు. తాజాగా తన మాటను నిలబెట్టుకుంటూ.. ఆ వంద మంది కుటుంబాల లిస్ట్ ను అనౌన్స్ చేశాడు విజయ్. దీంతో రౌడీ హీరోపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరి ఆ వంద మంది కుటుంబాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా డైరెక్డర్ శివ నిర్వాణ తెరకెక్కించిన యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటరైనర్ ‘ఖుషి’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాక్ పరంగా సక్సెస్ అనిపించుకుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం అంతగా సక్సెస్ కాలేదని రికార్డులు చెబుతున్నాయి. కాగా.. ‘ఖుషి’ సినిమాను సూపర్ హిట్ చేసిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకోవాలని విజయ్ దేవరకొండ అనుకున్నాడు. అందులో భాగంగానే 100 ఫ్యామిలీస్ ను ఎంపిక చేసి.. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఇస్తానని వైజాగ్ సక్సెస్ మీట్ లో ప్రకటించాడు. ఇందుకు పది రోజుల టైమ్ కూడా ఇచ్చాడు రౌడీ హీరో.
దాంతో ఇందుకు సంబంధించిన ఫామ్ ఇచ్చి అందులో రిజిస్టర్ అవ్వండని చెప్పగా.. చాలా మంది రిజిస్టర్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ.. సోషల్ మీడియా వేదికగా 100 లక్కీ కుటుంబాల లిస్ట్ ను రిలీజ్ చేశాడు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపాడు విజయ్. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా విజేతలను ఎంపిక చేయడం విశేషం. త్వరలోనే వీరికి హైదరాబాద్ లో జరిగే ఖుషి గ్రాండ్ ఈవెంట్ లో చెక్ లు పంపిణీ చేయబోతున్నారు.
కాగా.. హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ.. ‘ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసుకునేందుకు ఈ వంద మంది ఫ్యామిలీస్ ను ఎంపిక చేశాం. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న విజయ్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. మరి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The 100 familes we picked this time. I hope it brings cheer to your families ❤️🥰#SpreadingKushi#DevaraFamily pic.twitter.com/9Om8E2dJho
— Vijay Deverakonda (@TheDeverakonda) September 14, 2023