మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం

నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. MAA ఎన్నికలకు ఇంకా చాలా గడువు ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే, ఉన్నట్టుండి మంచు విష్ణు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో మా సభ్యులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారట. ఇదే అంశం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు మా అధ్యక్షుడు మంచు విష్ణు తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? అసలేం జరిగిందంటే?

నటుడు, మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే? సోమవారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సభ్యులు అందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో మంచు విష్ణు రాబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన సమావేశంలో మా సభ్యులందరికీ తెలియజేసినట్లు సమాచారం.

ఇదికపోతే.. మా అధ్యక్ష పదవి ముగియకముందే తాను ఇచ్చిన హామీలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట మంచు విష్ణు. అయన ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది మా బిల్డింగ్ నిర్మాణం. తన పదవి ముగియకముందే మంచు విష్ణు మా బిల్డింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నానని మా సర్వసభ్య సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఉన్నట్టుండి మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకోవడంతో మా సభ్యులతో పాటు సినీ ప్రముఖులు అంతా షాక్ గురయ్యారట. ఇదిలా ఉంటే.. గతంలో హోరాహోరిగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పై విజయం సాధించిన విషయం తెలిసింది. దీంతో అప్పటి నుంచి మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Show comments