iDreamPost
iDreamPost
ఇప్పటికే ఒకే రోజు క్లాష్ అయితే ఇబ్బందని ఏప్రిల్ 22కి వాయిదా పోస్ట్ పోన్ చేసుకున్న Jersey హిందీ రీమేక్ ఇప్పుడా డేట్ కి కట్టుబడటం కూడా అనుమానంగానే ఉంది. కారణం రాఖీ భాయ్ ర్యాంపేజని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం రెండు రోజులకే 100 కోట్లు ఒక్క హిందీ వెర్షన్ నుంచే రాబట్టిన ఈ మాన్స్ టర్ డ్రామా ఇంకో పది రోజులు ఇంతే రాక్ సాలిడ్ గా ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పుడేవి వచ్చినా అనవసరంగా రిస్క్ లో పడటం తప్ప ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జెర్సీ మళ్ళీ డేట్ మార్చుకోక తప్పదని చెబుతున్నారు. అయినా నిర్మాతలు, హీరో షాహిద్ కపూర్ దానికి సిద్ధంగా లేరు.
గత ఏడాది డిసెంబర్ తో మొదలుపెట్టి అంతకు ముందు ఏడాదికి పైగా ఇది చాలాసార్లు వాయిదా పడింది. పైగా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో మాస్ మార్కెట్ లో దీనికి ఎలాంటి స్పందన వస్తుందోననే అనుమానాలు లేకపోలేదు. అలాంటప్పుడు కెజిఎఫ్ 2 గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం నేరుగా కలెక్షన్ల మీద పడుతుంది. ఆడియన్స్ కేవలం ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కోసం థియేటర్ కు రావడం లేదు. వాళ్ళ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. RRR, Puspa, KGF2 లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్లు చూశాక కన్నీళ్లు తెప్పించే మెలోడ్రామాలకు డబ్బులిచ్చి టికెట్లు కొనాలంటే వాళ్ళను కష్టపడి ఒప్పించాలి.
సో జెర్సీ ఏం చేయబోతుందన్నది ఒకటి రెండు రోజులు ఆగాక క్లారిటీ వస్తుంది. ఆర్ఆర్ఆర్ వచ్చిన వారానికే మిషన్ ఇంపాజిబుల్ అనవసరమైన రిస్క్ చేసి దారుణంగా దెబ్బ తింది. కంటెంట్ యావరేజ్ గా ఉన్నా కూడా దానికి రావాల్సిన మినిమమ్ రెస్పాన్స్ కూడా దక్కించుకోలేదు. రెండు వారాలు గ్యాప్ తీసుకున్న గని సైతం డిజాస్టర్ బారిన పడింది. ఆడియన్స్ డిమాండ్లు పెరిగిపోతున్న తరుణంలో బడ్జెట్ ఖర్చు పెట్టని ఎమోషనల్ డ్రామాలకు థియేటర్లు నిండటం రాబోయే రోజుల్లో సవాల్ గా మారనుంది. ఇవన్నీ చూస్తూ షాహిద్ కపూర్(Shahid Kapoor) చాలా అసహనంగా ఉన్నాడని బాలీవుడ్ మీడియా న్యూస్. ఇంత జరిగితే అలా అనిపించడం సహజమే