iDreamPost
android-app
ios-app

Vijay Deverakonda: వీడియో: విజయ్ దేవరకొండకు ముద్దు పెట్టిన షాహీద్ కపూర్

  • Published Mar 20, 2024 | 2:44 PM Updated Updated Mar 20, 2024 | 2:44 PM

Vijay Deverakonda.. అర్జున్ రెడ్డి విజయ్ రేంజ్ పెంచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే సినిమా విజయ్ దేవరకొండ అంటే బాలీవుడ్ భామలకే కాదూ.. హీరోల్లో కూడా క్రేజ్ ఏర్పరిచింది. తాజాగా అతడిపై తన అభిమానాన్ని చూపించాడు

Vijay Deverakonda.. అర్జున్ రెడ్డి విజయ్ రేంజ్ పెంచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే సినిమా విజయ్ దేవరకొండ అంటే బాలీవుడ్ భామలకే కాదూ.. హీరోల్లో కూడా క్రేజ్ ఏర్పరిచింది. తాజాగా అతడిపై తన అభిమానాన్ని చూపించాడు

  • Published Mar 20, 2024 | 2:44 PMUpdated Mar 20, 2024 | 2:44 PM
Vijay Deverakonda: వీడియో: విజయ్ దేవరకొండకు ముద్దు పెట్టిన  షాహీద్ కపూర్

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రాబోయే సినిమా, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. మంగళవారం ముంబయి వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియో 2024 పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో లిస్ట్ ప్రకటించింది. ఇందులో రిలీజ్ చిత్రాలతో పాటు షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. హిందీ, తెలుగు, తమిళ్ చిత్రాలకు సంబంధించి 70 చిత్రాలు, సిరీస్ వివరాలను అనౌన్స్ చేసింది సంస్థ. ఈ ఈవెంట్ లో బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు మెరిశారు. కరణ్ జోహార్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, సమంత, రిషబ్ శెట్టి, టైగర్ ష్రాఫ్, విక్రమ్ కుమార్, మృణాల్ ఠాకూర్, శ్రియా, శ్రియా రెడ్డి, రకుల్ వంటి స్టార్స్ సందడి చేశారు. నాగ చైతన్య, సమంత ఒకే ఈవెంట్‌లో కలుసుకున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి.

కాగా, విజయ్ దేవరకొండకు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి విదితమే. అర్జున్ రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్ ముద్దుగుమ్మలకు కూడా క్రష్ అయిపోయాడు ఈ రౌడీ బాయ్. బాలీవుడ్ బ్యూటీస్ కే కాదూ..హీరోలకు కూడా విజయ్ పై విపరీతమైన అభిమానం ఉందని మరోసారి నిరూపితమైంది. ఈ షోలో షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. దీనికి కారణం విజయ్‌కు షాహిద్ కపూర్ ముద్దు పెట్టడమే కారణం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో ఒకటి ఫ్యామిలీ స్టార్ కూడా. ఈ సందర్భంగా విజయ్, మృణాల్ సందడి చేశారు. అయితే ఆ సమయంలో షాహిద్ కపూర్ .. విజయ్ భుజంపై తలవాల్చి.. అతడ్ని ముద్దుపెట్టుకున్నాడు.

షాహిద్ ఈ సినిమా గురించి విజయ్‌తో మాట్లాడుతూ ‘ నేను నీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే.. నువ్వులేకుంటే అర్జున్ రెడ్డి ఉండేది కాదూ.. కబీర్ సింగ్ పుట్టడు’ అంటూ ముద్దు పెట్టాడు. అలాగే అర్జున్ రెడ్డి.. ఫ్యామిలీ మ్యాన్ ఎలా అయ్యాడు అంటూ ప్రశ్నించగా.. ఈ స్క్రిప్ట్ నచ్చి చేసినట్లు చెప్పాడు విజయ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా, సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ పాపులరైన సంగతి విదితమే. ఇదే చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు షాహీద్ కపూర్. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సో దీన్ని ఉద్దేశించి.. ఇలా అన్నాడు షాహీద్.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişdinamobet girişgrandpashabet