iDreamPost
android-app
ios-app

Salaar- KGF 2: సలార్ ట్రైలర్ లో KGF-2 క్యారెక్టర్! లింక్ లేదుంటూనే ఇదేమి ట్విస్ట్?

  • Published Dec 18, 2023 | 3:54 PM Updated Updated Dec 18, 2023 | 3:54 PM

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్ కి సలార్ కి లింకు లేదంటూ మేకర్స్ మాత్రం హింట్స్ ఇచ్చేస్తున్నారు.

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. మరోవైపు కేజీఎఫ్ కి సలార్ కి లింకు లేదంటూ మేకర్స్ మాత్రం హింట్స్ ఇచ్చేస్తున్నారు.

  • Published Dec 18, 2023 | 3:54 PMUpdated Dec 18, 2023 | 3:54 PM
Salaar- KGF 2: సలార్ ట్రైలర్ లో KGF-2 క్యారెక్టర్! లింక్ లేదుంటూనే ఇదేమి ట్విస్ట్?

ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సలార్ సినిమా కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 22న తెర మీద బొమ్మ ఎప్పుడు పడుతుందా? ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడదామా అంటూ కాచుకు కూర్చున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సూరీడు సాంగ్ కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కేవలం ప్రభాస్ ఇమేజ్ నే పెట్టుబడిగా పెట్టుకుని మేకర్స్ సినిమా రిలీజ్ కి సిద్ధమైపోయారు. ఈ మూవీ ఎన్ని రికార్డులు కొట్టినా అది మాత్రం ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబో స్టామినా అనే చెప్పాలి. ఈ సినిమాలో సర్ ప్రైజ్ లకు కూడా కొదవలేదు అనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ తమ తమ యూనివర్స్ లను క్రియేట్ చేశారు. ఒకటి రెండు సినిమాలు మాత్రమే కాకుండా తాము తీసే మూవీస్ కి లింక్ పెడుతూ.. స్టార్ హీరోలను స్క్రీన్ మీదకు తీసుకొచ్చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే లోకీ యూనివర్స్ తరహాలో.. ప్రశాంత్ నీల్ కూడా తన కేజీఎఫ్ యూనివర్స్ లో భాగంగానే సలార్ సినిమా తీశాడు అని అంతా అనుకున్నారు. సలార్ సినిమాలో కేజీఎఫ్ రిఫరెన్సులు అంటూ టీజర్ రిలీజైన టైమ్ లో హడావుడి చేశారు. మొదటి నుంచి యష్, ప్రభాస్ కలుస్తారంటూ టాక్ వచ్చింది. ఇంకేముంది వాళ్లిద్దరూ కలిస్తే సినిమా దద్దరిల్లిపోతుందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

కేజీఎఫ్- సలార్ సినిమాల మధ్య లింకు ఏమీ లేదంటూ ప్రశాంత్ నీల్ కుండబద్దలు కొట్టేశాడు. పైగా ఎలాంటి రిఫరెన్సులు లేకుండా సలార్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆ మూవీలో అసలు కేజీఎఫ్ రిఫరెన్స్ ఉండదూ అని ప్రశాంత్ నీల్ స్పష్టంగా చెప్పాడు. దాంతో అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. కానీ, ఒక సర్ ప్రైజ్ మాత్రం ఉంటుందంటూ ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు. ఆ సర్ ప్రైజ్ ని డీ కోడ్ చేసే పనిలో అభిమానులు పడ్డారు. అసలు డైరెక్టర్ ఏం సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు అంటూ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా కొందరు ఫ్యాన్స్ అసలు సర్ ప్రైజ్ ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేజీఎఫ్ కి సలార్ కి లింక్ ఉంటుందంటూ బలంగా చెబుతున్నారు.

విషయం ఏంటంటే.. కేజీఎఫ్-2లో ఒక క్యారెక్టర్ ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూని రాకీ చూస్తూ రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అదే క్యారెక్టర్ అదే కాస్ట్యూమ్ తో సలార్ సినిమాలో కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో జగపతిబాబు వెనకాల నడుస్తూ కనిపించడంతో.. ఇదే ఉదాహరణగా చెబుతూ కేజీఎఫ్ కి సలార్ సినిమాకి కచ్చితంగా లింకు ఉందంటున్నారు. ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన సర్ ప్రైజ్ ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజం? కచ్చితంగానే కేజీఎఫ్ రిఫరెన్స్ సలార్ సినిమాలో ఉంటుందా అంటే? చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారికంగా ఎక్కడా మేకర్స్ రివీల్ చేయడం లేదు. ఇది కేవలం అభిమానులు చెబుతున్న వర్షన్ మాత్రమే. డైరెక్టర్ ప్లాన్ చేసిన సర్ ప్రైజ్ తెలియాలి అంటే డిసెంబర్ 22న సినిమా రిలీజ్ అయ్యే దాకా ఆగాల్సిందే. మరి.. కేజీఎఫ్- సలార్ సినిమాకు లింకు ఉందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş