iDreamPost
android-app
ios-app

నిన్ను నా మూవీలో పెట్టుకున్నందుకు బాధ పడుతున్నా: సందీప్ రెడ్డి వంగా

  • Published Apr 18, 2024 | 9:54 PM Updated Updated Apr 18, 2024 | 9:54 PM

సందీప్ రెడ్డి వంగా.. సినిమాల్లోనే కాదు బయట కూడా అదే టెంపర్ తో ఉంటారు. ఎవరైనా ఏమైనా అంటే సినిమాతో, తన మాటలతో సమాధానం ఇచ్చి పడేస్తుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ నటుడిపై వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సందీప్ రెడ్డి వంగా.. సినిమాల్లోనే కాదు బయట కూడా అదే టెంపర్ తో ఉంటారు. ఎవరైనా ఏమైనా అంటే సినిమాతో, తన మాటలతో సమాధానం ఇచ్చి పడేస్తుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ నటుడిపై వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published Apr 18, 2024 | 9:54 PMUpdated Apr 18, 2024 | 9:54 PM
నిన్ను నా మూవీలో పెట్టుకున్నందుకు బాధ పడుతున్నా: సందీప్ రెడ్డి వంగా

అర్జున్ రెడ్డి ఈ మూవీ తెలుగులో ఒక సెన్సేషన్. ఈ సినిమాతో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ లో సుస్థిర స్థానాన్ని సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ హీరోతో యానిమల్ మూవీ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మూడే మూడు సినిమాలతో వరల్డ్ వైడ్ గా తెలుగోడి సత్తా ఏంటో చూపించారు సందీప్. మూవీ మేకింగ్ లో సందీప్ రెడ్డి ది కింగ్ అని అంటారు. ఈయన సినిమాల్లో నటిస్తే చాలు అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటిది సందీప్ రెడ్డి వంగా సినిమాలో నటించడం నా దురదృష్టం అని ఒక నటుడు కామెంట్స్ చేశారు. మరి మన సందీప్ రెడ్డి వంగా ఊరుకుంటారా? ఎక్స్ ఖాతాలో స్ట్రాంగ్ గా ఇచ్చి పడేశారు.    

కబీర్ సింగ్ సినిమాలో కాలేజీ డీన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అదిల్ హుస్సేన్ నటించారు. ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యింది. అప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు మెదిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదిల్ హుస్సేన్.. కబీర్ సింగ్ సినిమాని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎందుకు నటించానా అని ఫీలైన సినిమా ఏదైనా ఉందంటే.. అది కబీర్ సింగ్ సినిమానే అని కామెంట్స్ చేశారు. ఆ మూవీలో కాలేజ్ డీన్ గా నటించా అని.. అయితే ఆ పాత్రలో నటించడం తనకిష్టం లేదని అన్నారు. ఎన్నిసార్లు నో చెప్పినా.. తనను ఎంతగానో రిక్వెస్ట్ చేశారని.. ఒకే ఒక్కరోజు షూట్ కి రావాలని కోరడంతో ఒప్పుకున్నానని అన్నారు. పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని.. దీంతో ఒక రోజు షూట్ చేసి వచ్చేసా అని అదిల్ అన్నారు. అయితే ఆ సీన్ లో నటించినప్పుడు బానే ఉందనిపించిందని.. కానీ సినిమా రిలీజయ్యాక ఈ సినిమాలో ఎందుకు నటించానా అని బాధపడ్డా అని అన్నారు.

ఫ్రెండ్ తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలయ్యా అని.. సినిమా మధ్యలోనే బయటకు వచ్చేసా అని చెప్పుకొచ్చారు. అంతేకాదు తన భార్యతో ఆ మూవీని చూడద్దని కూడా చెప్పానని అన్నారు. ఒకవేళ ఆమె చూసి ఉంటే తనను బండ బూతులు తిట్టేదాన్ని అదిల్ హుస్సేన్ వెల్లడించారు. ఈ కామెంట్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో సందీప్ వరకూ వెళ్ళింది. దీంతో ఈ వీడియోని షేర్ చేస్తూ.. అదిల్ కి సందీప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు గొప్పగా భావించి నటించిన 30 సినిమాలతో రాని ఫేమ్.. ఎందుకు నటించానా అని ఓ తెగ ఫీలైపోతున్న బ్లాక్ బస్టర్ మూవీ వల్ల వచ్చింది. నటనపై ప్యాషన్ కంటే దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు బాధగా ఉంది. ఇక నుంచి ఆ సీన్ లో ఏఐ సాయంతో నీ ముఖాన్ని మార్చి నువ్వు సిగ్గు పడకుండా చేస్తా. ఇప్పుడు సరిగా నవ్వు” అంటూ సందీప్ రెడ్డి వంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. మరి అదిల్ హుస్సేన్ చేసిన కామెంట్స్ పై.. అలానే అదిల్ హుస్సేన్ కి సందీప్ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio