iDreamPost
android-app
ios-app

ఆడ రోబోతో ప్రేమ.. OTTలో ఈ లవ్ స్టోరీ అస్సలు మిస్ కావొద్దు!

  • Published Jul 04, 2024 | 6:13 AM Updated Updated Jul 04, 2024 | 6:13 AM

OTT Suggestions- Teri Baaton Mein Aisa Uljha Jiya: ఓటీటీలో ఒక వింత ప్రేమకథ ఉంది. ఇందులో హీరో ఒక ఆడ రోబోతో ప్రేమలో పడతాడు. కానీ, ఆమె రోబో అనే విషయం అతనికి అస్సలు తెలియదు. తెలిసిన తర్వాత ఏమైంది? తెలియాలంటే ఈ మూవీ చూసేయండి.

OTT Suggestions- Teri Baaton Mein Aisa Uljha Jiya: ఓటీటీలో ఒక వింత ప్రేమకథ ఉంది. ఇందులో హీరో ఒక ఆడ రోబోతో ప్రేమలో పడతాడు. కానీ, ఆమె రోబో అనే విషయం అతనికి అస్సలు తెలియదు. తెలిసిన తర్వాత ఏమైంది? తెలియాలంటే ఈ మూవీ చూసేయండి.

  • Published Jul 04, 2024 | 6:13 AMUpdated Jul 04, 2024 | 6:13 AM
ఆడ రోబోతో ప్రేమ.. OTTలో ఈ లవ్ స్టోరీ అస్సలు మిస్ కావొద్దు!

ఓటీటీల్లో లవ్ స్టోరీలకు మంచి డిమాండ్ ఉంది. అలాగే లవ్ స్టోరీ అంటే యాక్షన్, కామెడీ ఉంటుంది. చాలామంది లవ్ స్టోరీ విత్ కామెడీ కావాలి అని కోరుకుంటారు. అందుకే అలాంటి వారికోసం ఒక క్రేజీ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. ఈ మూవీ చూస్తున్నంత సేపు మీరు నవ్వుతూనే ఉంటారు. అయితే ఇందులో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంది. హీరో ప్రేమించేది ఒక రోబోని. ఆ విషయం అతనికి తెలియదు. కానీ, ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడు. మరి.. ఆ తర్వాత ఏమైంది? అసలు ఇది ఏ మూవీ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం. అలాగే ఈ సినిమా కథ గురించి కూడా తెలుసుకుందాం.

సాధారణంగా ఇండియన్ అభిమానులకు రోబో బేస్డ్ మూవీస్ అంటే కచ్చితంగా డైరెక్టర్ శంకర్- రజినీకాంత్ తీసిన రోబో మూవీనే గుర్తు వస్తుంది. అలాంటి మూవీకి ఫుల్ ఆపోజిట్ ఫార్మాట్ లో ఈ చిత్రం వచ్చింది. ఈ సినిమా బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. అలాగే ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోంది. ఇలాంటి సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్ ఉండటం మరింత ప్లస్ పాయింట్ అయ్యింది. ఈ సినిమాలో ఒక హీరో ఉంటాడు. అతను ఒక అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి కూడా అతని ప్రేమలో మునిగిపోతుంది. వాళ్లిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు తనను ఇంట్లో వాళ్లకు కూడా పరిచయం చేస్తాడు. ఆమె ప్రవర్తన మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. అంతా ఎందుకలా ఉంది అని అడగ్గా ఆమె అమెరికా నుంచి వచ్చింది.. అందుకే అలా కాస్త భిన్నంగా ప్రవర్తిస్తోంది అని హీరో కవర్ చేస్తాడు.

అప్పటి వరకు హీరోకి కూడా కృతి సనన్ ఒక రోబో అనే విషయం తెలియదు. ఆమెతో ప్రేమలో ఉండగా.. అతనికి అసలు విషయం తెలుస్తుంది. హీరో చుట్టమే ఈ రోబోని తయారు చేసింది. ఆ తర్వాత ఆమె జస్ట్ రోబో అనే విషయాన్ని తనకు తాను చెప్పుకుంటాడు. కానీ, ఆమెపై ప్రేమను మాత్రం హీరో తీసేయలేకపోతాడు. పైగా ఆ రోబో కూడా హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉంటుంది. రోబో అయితే ప్రేమించకూడదా అని ప్రశ్నిస్తుంది. అక్కడ మాత్రం అంతా కాస్త ఎమోషనల్ అవుతారు. ఈ సినిమా పేరు ‘తేరీ బాతోంమే ఏసా ఉల్జా జియా‘. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ మీరు ముందే చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom