Swetha
తెలంగాణ పోలీసులు కేవలం తమ కర్తవ్యాలను నిర్వర్తించడమే కాకుండా.. కొన్ని సందర్భాలలో సమయస్ఫూర్తితో స్పందించి.. ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
తెలంగాణ పోలీసులు కేవలం తమ కర్తవ్యాలను నిర్వర్తించడమే కాకుండా.. కొన్ని సందర్భాలలో సమయస్ఫూర్తితో స్పందించి.. ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
Swetha
పోలీసులు సమాజానికి , సమాజంలోని ప్రజలకు అండగా నిలుస్తూ.. నిరంతరం రక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కేవలం నామ మాత్రంగా వారి డ్యూటీని చేయడం మాత్రమే కాకుండా.. అత్యవసర పరిస్థితిలో ప్రజల ప్రాణాలను సైతం కాపాడుతున్నారు. ఇప్పటివరకు మన చుట్టూ తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించే పోలీసులను ఎంతో మందిని చూసి ఉంటాము. కానీ, వారందరిలో చాలా కొద్దీ మంది మాత్రమే.. అత్యవసర పరిస్థితిల్లో ప్రజల ప్రాణాలను కాపాడి .. అందరితో రియల్ హీరో అనిపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలానే తెలంగాణ పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడుతూ జనాల ప్రశంసలు పొందుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా .. ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు ఒక పోలీస్ కానిస్టేబుల్. దానికి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సాధారణంగా చాలా వరకు పోలీసులు కేవలం చట్ట పరంగా.. న్యాయ పరంగా వారి భాద్యతలను నిర్వరిస్తూ ఉంటారు. కానీ, అతి కొద్దీ మంది మాత్రమే మానవత్వం చాటుకుంటూ .. అందరి మన్ననలు పొందుతారు. తాజాగా హైదరాబాద్ మహానగర పరిధిలో ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ సమీపంలోని బడంగ్‌పేట్ ప్రాంతంలో నివసిస్తున్న జగన్ అనే వ్యక్తి.. వ్యక్తిగత సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పైగా, ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ముందు.. 100కు డయల్ చేసి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం కూడా అందించాడు. దీనితో ఆ సమయంలో నైట్ డ్యూటీ చేస్తున్న .. కానిస్టేబుల్ సూర్యనారాయణ నరసింహ వెంటనే స్పందించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న ఆ వ్యక్తి ఇంటికి వెంటనే బయల్దేరి వెళ్ళాడు . కానీ, అప్పటికే అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు.
దీనితో ఫ్యాన్‌కు వేలాడుతూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జగన్‌ను చూసిన కానిస్టేబుల్.. సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి.. అతన్ని కిందకు దించి.. వెంటనే సిపిఆర్ చేశారు. దీనితో ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. జగన్ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సూర్యనారాయణకు.. అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత జగన్ ను ట్రీట్మెంట్ కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. ఆ వ్యక్తికీ కౌన్సిలింగ్ కూడా అందించారు. ఇక సమాచారం అందుకున్న తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించిన కానిస్టేబుల్ ను .. అందరు ప్రశంసించారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.