iDreamPost
android-app
ios-app

Telangana: పంజా విసురుస్తున్న చలి.. విజృంభిస్తున్న న్యుమోనియా!

  • Published Nov 30, 2024 | 11:15 AM Updated Updated Nov 30, 2024 | 11:15 AM

Telangana: చలి విపరీతంగా పెరిగిపోతుంది. జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

Telangana: చలి విపరీతంగా పెరిగిపోతుంది. జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

Telangana: పంజా విసురుస్తున్న చలి.. విజృంభిస్తున్న న్యుమోనియా!

శీతాకాలం రావడంతో చలి విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. జనాలను గజ గజ వణికిస్తుంది. అందువల్ల చాలా మంది కూడా అస్వస్థకు గురైవుతున్నారు. చలి తీవ్రత కారణంగా న్యూమోనియా విజృంభిస్తుంది. న్యుమోనియా కేసులు రోజురోజుకు బాగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే నిలోఫర్ ఆస్పత్రిలో కేసులు చాలా ఎక్కువయ్యాయని తెలిసింది. దాదాపు 200 దాకా కేసులు వచ్చాయని సమాచారం. ప్రతీరోజూ ఓపీకి దాదాపు 30-40 మంది పేషంట్స్ వస్తున్నారు. సోమ, మంగళవారం, బుధవారాల్లో అయితే 60 మంది దాకా ఆస్పత్రికి వస్తున్నారు. ఇక అంతేకాదు కొంతమందికి HFNC, వెంటిలేటర్ చికిత్సలు అవసరమవుతున్నాయి. లంగ్స్ లో ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే న్యూమోనియా బాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వలన స్ప్రెడ్ అవుతుంది. 5 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైన ఉన్న వృద్ధుల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపుతోంది.

స్ట్రెప్టోకోకస్, రెస్పిరేటరీ సిన్సిటియర్ వైరస్‌ (RSV) ఇంకా అలాగే ఇన్‌ఫ్లూయెంజా వైరస్ న్యూమోనియాకు చాలామంది గురవుతున్నారు. అయితే చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కేవలం ఒక్క న్యూమోనియా మాత్రమే కాకుండా ఆస్తమా, ఇతర శ్వాసకోస ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. న్యుమోనియా సమస్యతో పాటు ఈ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులకు ఆరు నెలల దాకా తల్లిపాలని తాగించాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల న్యూమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లను నియంత్రించవచ్చని చెబుతున్నారు. తీవ్రంగా జ్వరం రావడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శరీరం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

అలాగే ఈ చలికాలంలో ఎవరూ కూడా ఉదయం 10 గంటలలోపు బయటకి రాకపోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఉదయం 10 గంటల దాకా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఉదయం 10 దాటాక బయటకి వస్తే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే సాయంత్రం 6 దాటాక బయటకి రాకపోవడం మంచిది అంటున్నారు. అలాగే కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ ఇంకా టీ, కాఫీ అస్సలు తాగొద్దని సూచిస్తున్నారు. బయటకి వచ్చేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే చలి ఆ రకంగా వణిస్తుంది. కాబట్టి కచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. ఈ జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.