P Venkatesh
ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్. తార్నాకాలోని రైల్వే డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కోర్సులు చదివితే ఫ్యూచర్ కు తిరుగుండదు.
ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్. తార్నాకాలోని రైల్వే డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కోర్సులు చదివితే ఫ్యూచర్ కు తిరుగుండదు.
P Venkatesh
ఈ ఏడాది ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైన ఇంటర్ విద్యార్థులు ఏ కోర్సులు చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇంటర్ తర్వాత ఏ కోర్సును తీసుకుంటే త్వరగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్యార్థులు ఆరాతీస్తున్నారు. కొంతమంది డిగ్రీ వైపు మొగ్గుచూపుతుంటె, మరికొంతమంది ఇంజినీరింగ్, మెడిసిన్ చదివేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. అయితే ఇంటర్ పాసైన వారికి తార్నాకాలోని రైల్వే డిగ్రీ కాలేజ్ గుడ్ న్యూస్ అందించింది. రైల్వే డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ కోర్సుల్లో చేరితే ఫ్యూచర్ కు తిరుగుండదని, ఉద్యోగ అవకాశాలకు కొదవ ఉండదని అంటున్నారు నిపుణులు.
మీరు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యారా? ఒక వేళ మీరు డిగ్రీ చేయాలనుకుంటే తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కోర్సుల్లో చేరాలనుకుంటే టీజీ దోస్త్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా దక్షిణ మధ్య రైల్వే 2017-18 విద్యా సంవత్సరం నుండి బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ) – ఇంగ్లీష్ మీడియం, బీఎస్సీ (గణితం, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్) – ఇంగ్లీష్ మీడియం, . బి.కాం. (జనరల్) – ఇంగ్లీష్ మీడియం, బి.కాం. (కంప్యూటర్లు) – ఇంగ్లీష్ మీడియం కోర్సులను ప్రవేశపెట్టారు. వీటితో పాటు ఈ విద్యాసంవత్సరం అదనంగా మరో రెండు కోర్సులను ప్రారంభించారు.
కొత్తగా బీబీఏ అండ్ బీకాం ఫైనాన్స్ కోర్సులను తీసుకొచ్చారు. ఈ కోర్సులను అభ్యసిస్తే భవిష్యత్ బంగారమే అంటున్నారు విద్యా నిపుణులు. ఈ కోర్సులను అభ్యసిస్తే రైల్వేలతో పాటు పలు రంగాల్లో ఉద్యోగావకాశాలు విరివిగా లభిస్తాయని చెబుతున్నారు. ఇంట్రస్టు ఉన్న విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఇవే కాక ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు చేయొచ్చు. పారామెడికల్ కోర్సులతో కూడా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇంటర్ అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిద శాఖల్లో ఉద్యోగాలను పొందొచ్చు. కేంద్ర సంస్థలైన త్రివిధ దళాల్లో జాబ్స్ సాధించొచ్చు.