P Venkatesh
ఆధార్ కార్డును అప్ డేట్ ఉచితంగా చేయించేందుకు ప్రభుత్వం గడువు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఆధార్ అప్ డేట్ చేయించేందుకు కొత్త ఛార్జీలు ఎంతో తెలుసా?
ఆధార్ కార్డును అప్ డేట్ ఉచితంగా చేయించేందుకు ప్రభుత్వం గడువు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఆధార్ అప్ డేట్ చేయించేందుకు కొత్త ఛార్జీలు ఎంతో తెలుసా?
P Venkatesh
కేంద్ర ప్రభుత్వం భారత పౌరులకు జారీ చేసిన ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో మనందరికి తెలిసిందే. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా.. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయాలన్నా ఇలా అనేక రకాల ప్రయోజనాలకు ఆధార్ కార్డ్ కీలకంగా మారింది. ఆధార్ కార్డుపై వ్యక్తికి సంబంధించిన ఫోటో, వయసు, అడ్రస్ వంటి వివరాలు ఉంటాయి. దీన్ని గుర్తింపు పత్రంగా ఉపయోగించుకోవచ్చు. అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొంత కాలం నుంచి ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తుంది. మరి మీరు మీ ఆధార్ కార్డును అప్ డేట్ చేయిస్తున్నారా? ఆధార్ కార్డు అప్ డేట్ చేయించడానికి కొత్త ఛార్జీలు ఎంతో తెలుసా?
ఆధార్ కార్డులో పేరు, ఆడ్రస్, ఫోటో ఇలా ఏ విధమైన మార్పులు చేయదల్చినా కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రేట్ల ప్రకారం.. వేలిముద్రల మార్పు లేదా కంటి స్కాన్కోసం రూ. 100 ఛార్జీలు వసూలు చేస్తారు. పేరు, పుట్టిన తేదీ, చిరునామా మార్చుకుంటే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్లి రూ. 30 చెల్లించడం ద్వారా ఈ-ఆధార్ కార్డు ప్రింటెడ్ వెర్షన్ను పొందవచ్చు. మొదటిసారి ఆధార్కోసం నమోదు చేసుకుంటే ఎటువంటి ఛార్జీలు వర్తించవు.
అంతేకాకుండా ఐదు నుంచి పది హేను సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం పూర్తి ఉచితం. ఆధార్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటే పూర్తిగా ఉచితం. ఆధార్ కార్డును అప్ డేట్ ఉచితంగా చేసుకునేందుకు ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. గతంలో ఈ గడువు మార్చి 14 కాగా, తాజాగా, ఆ గడువును జూన్ 14వ తేదీ వరకు పొడిగించింది. బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ వివరాల అప్ డేట్ తో సహా ఆధార్ సేవలకు అధిక ఛార్జీలు వసూలు చేయరాదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని ఆధార్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.