iDreamPost
android-app
ios-app

ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. రూ. 10 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే

కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే రూ. 10 వేల లోపు ధరలో 5జీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. మతిపోయే ఫీచర్లతో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే రూ. 10 వేల లోపు ధరలో 5జీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. మతిపోయే ఫీచర్లతో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. రూ. 10 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఇవే

టెలికాం కంపెనీలు 5జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలు 5జీ సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు 5జీ మొబైల్స్ ను తీసుకొచ్చే పనిలో పడ్డాయి. దాదాపు అన్ని కంపెనీలు 5జీ ఫోన్స్ పై దృష్టిపెట్టాయి. ఇప్పటికే 5జీ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. 5జీ స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి.

అయితే మంచి ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ కావాలంటే 15 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. బ్రాండెడ్ కంపెనీలు సైతం తక్కువ ధరలోనే 5జీ ఫోన్లను తీసుకొస్తున్నాయి. మరి మీరు ఈ మధ్య కాలంలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? రూ. 10 వేల లోపే బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే రూ. 10 వేల లోపే లభించే 5జీ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

Redmi A4 5G:

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇటీవల Redmi A4 5G స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. రూ. 8499కే రెడ్ మీ 5G ఫోన్ ను అందిస్తోంది. బడ్జెట్ ధరలో ఈ కొత్త 5G ఫోన్ డిజైన్, ఫీచర్లు కస్టమర్లను ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ కావాలనుకునే వారికి Redmi A4 5G ఫోన్ బెస్ట్ ఆప్సన్ గా చెప్పొచ్చు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నది. దీని 4GB + 64GB వేరియంట్ ధర రూ. 8499గా కంపెనీ నిర్ణయించింది. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 9,499గా ఉంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది.ఈ ఫోన్ Snapdragon 4S Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. Redmi A4 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ స్లాట్ అందించబడింది. ఇది ఆండ్రాయిడ్ 14OSలో నడుస్తుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన ప్రైమరీ కెమెరా అందించారు. ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇంకా ఈ ఫోన్‌లో సైడ్‌మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ 18W ఛార్జింగ్‌ సపోర్ట్ తో 5160mAh బ్యాటరీ సామార్ధ్యాన్ని కలిగి ఉంది.

Moto G45

ఇటీవల మోటరోలా కంపెనీ మెటో జీ45 5జీ పేరిట కొత్త మొబైల్ ను తీసుకొచ్చింది. మోటో జీ45 5జీ రెండు వేరియంట్లో లభిస్తుంది. 4జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.10,999కాగా.. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. బ్రిలియంట్‌ బ్లూ, బ్రిలియంట్‌ గ్రీన్‌, వివా మెజెంటా కలర్ ఆప్షన్లలో లభించనుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే వస్తోంది. ఇందులో 120హెచ్ జెడ్ రిఫ్రెష్‌ రేట్ తో వస్తుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జనరేషన్‌ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14తో పనిచేస్తుంది. వెనకవైపు 50 ఎంపీ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌, ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 20వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తుంది. అయితే ఈ మొబైల్ ను బ్యాంకు ఆఫర్లను యూజ్ చేసి కొనుగోలు చేసినట్లైతే రూ. 10 వేల లోపే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

iQOO Z9 Lite 5G

ఐక్యూ మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. రూ. 10 వేల లోపు ధరకే 5జీ ఫోన్లను అందిస్తున్నది. ఐక్యూ నుంచి iQOO Z9 Lite 5G రూ. 10 వేల 409కే వచ్చేస్తోంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఐక్యూ Z9 లైట్ 6.56-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 6ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14లో రన్ అవుతుంది. ఐక్యూ Z9 లైట్ 5జీ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ 64 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. 50 ఎంపీ సోనీ ఏఐ కెమెరాతో వస్తుంది.

Realme C63 5G

రూ. 10 వేల లోపు ధరలో బెస్ట్ 5జీ మొబైల్ కావాలనుకుంటే రియల్ మీ సీ 63 5జీపై ఓ లుక్కేయండి. ఇది 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 9,099గా ఉంది. రియల్ మీ సీ63 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6100 5జీ చిప్‌తో వస్తుంది. 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ 10వాట్ వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక 32ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ముందు భాగంలో, రియల్‌మి సీ63 5జీ కి 8ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చబడి ఉంది.