Uppula Naresh
Uppula Naresh
తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. అయితే బీఆర్ఎస్ ను వీడిన కొందరు లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరుతుంటే, మరికొందరు మాత్రం కాషాయ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ, చాలా మంది నేతలు మాత్రం హస్తం పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇకపోతే.. కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను సోమవారం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3 విడుదల కానుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEC)రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ నవంబర్ 30న జరగనుండగా, ఫలితాలు మాత్రం డిసింబర్ 3న వెలువడనున్నాయని అన్నారు. ఇక షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల నేతుల దూకుడు పెంచనున్నారు.
అయితే ఈ క్రమంలోనే MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం కాయం అని జోస్యం చెప్పారు. ఇక మేము కూడా ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తాము పోటీ చేసే ప్రతిచోటా గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాజస్థాన్లోనూ పోటీ చేస్తామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.