iDreamPost

నెల రోజుల్లోనే తెలంగాణ ఎన్నికలు.. KCRకే లాభమా?

నెల రోజుల్లోనే తెలంగాణ ఎన్నికలు.. KCRకే లాభమా?

తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణలో నవంబర్30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలానే డిసెంబర్3న ఎన్నికల కౌటింగ్ జరగనుంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలక్షన్ షెడ్యూల్ చూసినట్లు అయితే.. అతి తక్కువ సమయం మాత్రమే ఎన్నికల నిర్వహణకు ఉంది. నెలన్నర రోజుల్లోనే జరగనున్న ఈ ఎన్నికలు సీఎం కేసీఆర్ కి అనుకూలంగా ఉన్నాయని, ఆయనకు లాభం చేకూర్చేలా ఉన్నాయని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. త్వరలో తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నోటిషికేషన్ విడుదలపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చుని అన్ని పార్టీలు  అభిప్రాయ పడ్డాయి. అయితే గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం అందరి కంటే ముందే ఎన్నికల యుద్ధంలో దిగారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో సంబంధం లేకుండా 119 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. చిన్న చిన్న మార్పులు జరిగినప్పటికి అభ్యర్థుల ప్రకటన మాత్రం పూర్తి చేశారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నేతలు ప్రచారం కూడా ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే  ఇది కేసీఆర్ కి లాభం చేకూరుస్తోందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంటే.. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం అభ్యర్థుల ఎంపిక దగ్గరే ఉన్నారు.  ఇదే సమయంలో ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల ప్రచారంలోకి దిగేలోపు, బీఆర్ఎస్ రెండో విడత ప్రచారం కూడా చేస్తుందని రాజకీయ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. అలానే అసంతృప్తులను బుజ్జగించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. మరి.. బీజేపీ, కాంగ్రెస్ లు కూడా అసంతృప్తులను బుజ్జగించి.. ఎన్నికల ప్రచారంలోకి వెళ్లే సరికి ఎన్నికల వచ్చేస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇలా తక్కువ సమయంలోనే  ఎన్నికల  ఉండటం.. ఇప్పటికే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి.. సిద్ధంగా ఉండటంతో… ఆయనకే ఎక్కువ లాభమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి.. తాజాగా విడుదలై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కేసీఆర్ కి లాభం అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోన్నటాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి