సరికొత్త EV బైక్.. పెట్రోల్ బండి కన్నా తక్కువ ధరలోనే..

Best Budget EV Bike: ప్రస్తుతం అందరూ కొత్తగా బండి కొనాలి అంటే ఎలక్ట్రిక్ బైక్ కొనాలని చూస్తున్నారు. అలాంటి వారికోసం ఇది బెస్ట్ బడ్జెట్ ఈవీ బైక్ అనే చెప్పాలి.

Best Budget EV Bike: ప్రస్తుతం అందరూ కొత్తగా బండి కొనాలి అంటే ఎలక్ట్రిక్ బైక్ కొనాలని చూస్తున్నారు. అలాంటి వారికోసం ఇది బెస్ట్ బడ్జెట్ ఈవీ బైక్ అనే చెప్పాలి.

ప్రస్తుతం చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. పెట్రోలు ధరలు ఎక్కువగా ఉండంటం, పర్యావరణానికి మేలు చేస్తుందనే కారణంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కార్లతో పోలిస్తే బైకులు మాత్రం విపరీతంగా కొనేస్తున్నారు. కానీ, విద్యుత్ వాహనాలకు సంబంధించి బైకుల ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్ లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ బైకు వచ్చంది. దాని ధర చూస్తే పెట్రోలు స్కూటీల ధరలకు దగ్గరగానే ఉంది. కొన్ని వాహనాలతో పోలిస్తే దీని ధరే తక్కువని చెప్పాలి.

మనం చెప్పుకుంటోంది సింపుల్ డాట్ వన్ బైక్ గురించి. ఇప్పటికే మార్కెట్ లో ఈ కంపెనీకి చెందిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటీ అందుబాటులో ఉంది. ఆ మోడల్ కి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. ఇప్పుడు సింపుల్ డాట్ వన్ పేరిట మరో సరికొత్త ఈవీని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని లుక్స్ మాత్రం అటు స్పోర్ట్స్ బైక్ మాదిరిగా ఉన్నాయి. అలాగే ఇంక ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ బైక్ 8500 వాట్స్ పవర్ ఫుల్ మోటర్ తో వస్తోంది. దీని రేంజ్ 152 కిలోమీటర్లుగా ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లుగా ఉంది. అంటే చాలా పవర్ ఫుల్ మోటర్ అనే చెప్పాలి.

ఈ సింపుల్ డాట్ వన్ స్కూటర్ రేంజ్ కూడా సింగిల్ ఛార్జ్ కి 152 కిలోమీటర్లు అంటే బెటర్ బైకే అవుతుంది. ఈ బైక్ కేవలం 2.7 సెక్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ స్కూటీలో 3.7kwh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. అంతేకాకుడా ఫ్రంట్ డిస్క్ మాత్రమే కాకుండా రేర్ డిస్క్ కూడా ఉంది. అలాగే యూఎస్ బీ ఛార్జింగ్ పోర్ట్, 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. అలాగే బూట్ స్పేస్ విషయానికి వస్తే.. 37 లీటర్స్ మంచి స్పేస్ లభిస్తోంది. ఇది మొత్తం 4 కలర్ ఆప్షన్స్ తో వస్తోంది. నమ్మ రెడ్, అజ్యూర్ బ్లూ, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్ అనే కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంక ఈ సింపుల్ డాట్ వన్ స్కూటీ ధర విషయానికి వస్తే.. ఇది రూ.99,999 ఎక్స్ షోరూమ్ ధరతో వస్తోంది.

 

ఈ సింపుల్ డాట్ 1 స్కూటర్ ఎప్పుడు మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతానికి సింపుల్ వన్ మోడల్ మాత్రం మార్కెట్ లో అందుబాటులో ఉంది. నిజానికి చాలా పెట్రోలు స్కూటీలతో పోలిస్తే.. ఇది బెస్ట్ ప్రైస్ ఆప్షన్ అనే చెప్పాలి. పైగా లుక్స్, స్పెసిఫికేషన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాలను గమనించాలి. ఒక స్కూటర్ రేంజ్ కనీసం 150 కిలోమీటర్లు ఉండాలి. అలాగే స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలీమీటర్లు కంటే కూడా ఎక్కువగా ఉండాలి. అలాంటి సమయంలో ఆ మోడల్ బైక్ కాస్త వర్కౌట్ అవుతుంది. లేదంటే మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంటుంది. మరి.. సింపుల్ డాట్ వన్ మోడల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments